ఏడాదిన్నర పాలనలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేసిన సేవలు ఇప్పుడు పంచాయతీ ఎన్నికల రూపంలో ఫలాలు వస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ మద్దతుదారులు సత్తా చాటుతున్నారు. అటు ఏకగ్రీవాలే కాకుండా.. ఇటు ఎన్నికల్లోనూ పార్టీ మద్దతుదారుల గెలుపు కనిపిస్తోంది. మొదటి విడతలో విజయనగరం మినహా మిగిలిన 12 జిల్లాల పరిధిలో 3,249 గ్రామ పంచాయతీల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నోటిఫికేషన్ జారీ చేశారు. వీటిలో 525 చోట్ల ఏకగ్రీవమయ్యాయి. 90 శాతం వైసీపీ మద్దతుదారులే గెలుపొందారు.
Also Read: గంటా.. జేడీ స్పెషల్ భేటీ : అందుకేనట..?
కొన్ని అవాంఛనీయ కారణాల వల్ల మూడు పంచాయతీలు మినహా మిగిలిన 2,721 చోట్ల ఈ నెల 9న పోలింగ్ జరిగింది. ఏకగ్రీవాలతో కలుపుకుని వైసీపీ మద్దతుదారులు ఏకంగా 2,640 సర్పంచ్‌లుగా ఎన్నికయ్యారు. అంటే పల్లెల్లో 81.25 శాతం వైసీపీ మద్దతుదారుల పాలనలోకి వచ్చాయి. కేవలం 15.66 శాతం పల్లెలు మాత్రమే టీడీపీ పాలనలోకి వచ్చాయి. ఇది మొదటి విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఫలితాలు.
తండ్రిలాగే వైఎస్ జగన్ కూడా మాట తప్పడనేది ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. అందుకే.. ప్రజలు ఈ ఫలాలు అందిస్తున్నట్లుగా అర్థమవుతోంది. ప్రజలకు ఏం కావాలో తెలుసుకొని మరీ సంక్షేమ పథకాలను అందిస్తున్నరు జగన్‌మోహన్‌రెడ్డి. అమ్మ ఒడి, పేదలకు ఇళ్లు, పింఛన్ల పెంపు, వైఎస్ఆర్ రైతు భరోసా, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ, జలయజ్ఞం, మద్యపాన నిషేధం, వైఎస్సార్ ఆసరా పథకాల అమలు అత్యంత పకడ్బందీగా, పారదర్శకంగా అమలవుతున్నాయి. ముఖ్యంగా పథకాలకు అర్హతలే ప్రామాణికంగా తీసుకుంటూ, కులాలు, మతాలు, పార్టీల ప్రస్తావనే లేకుండా పాలన అందిస్తుండడం అందరినీ ఆకట్టుకుంటోంది.
Also Read: ఎస్‌ఈసీ అధికారాలను వినియోగించినా..! : నామినేషన్లకు తప్పని అడ్డంకులు
పైగా ఏ పథకం ఎప్పుడు అమలుకు నోచుకుంటుందో ఏకంగా ఓ క్యాలెండర్‌ను కూడా రిలీజ్ చేసిన ఘనత జగన్ సర్కార్‌ది. నాటి చంద్రబాబు పాలనకు, నేటి జగన్ పాలనకు పోల్చుకుంటూ.. జగనే బెస్ట్ అని ప్రజలు ఓ స్థిరమైన నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది ఈ ఫలితాలను చూస్తుంటే. తూర్పుగోదావరి జిల్లాలో పవన్‌కల్యాణ్ సామాజిక వర్గం బలంగా ఉన్న చోట కూడా వైసీపీ భారీ ఆధిక్యతను ప్రదర్శించింది. అందుకు.. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే కారణమని కూడా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తంగా జగన్ పాలనను ప్రతిపక్షాలు విమర్శిస్తున్నా.. ప్రజలు మాత్రం అక్కున చేర్చుకున్నారని మరోసారి ఈ ఫలితాలు రుజువు చేశాయి.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్