బీహార్ లో దూసుకెళ్తున్న ఆర్జేడీ.. బీజేపీ-జేడీయూకు షాకే

ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమవుతున్నాయి. బీహార్ లో ప్రతిపక్ష ఆర్జేడీ -కాంగ్రెస్ మహాకూటమికి ఆధిక్యంలో దూసుకెళ్తోంది. సీఎం అభ్యర్థిగా ప్రకటించిన తేజస్వి యాదవ్ కూడా తన నియోజకవర్గంలో లీడ్ లో ఉన్నారు. Also Read: బీహార్ కా షేర్ తేజస్వి..మోడీ-నితీష్ కు షాక్ యేనా? బీహార్ రాష్ట్రంలో మొత్తం 243 స్థానాలకు గాను 217 స్థానాల్లో కౌంటింగ్ ఫలితాలు తెలిసాయి. ఇందులో బీజేపీ-జేడీయూ 90 స్థానాల్లో లీడ్ లో ఉండగా.. ప్రతిపక్ష ఆర్జేడీ-కాంగ్రెస్ కూటమి124 కూటమి ఏకంగా […]

Written By: NARESH, Updated On : November 10, 2020 12:39 pm
Follow us on

ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమవుతున్నాయి. బీహార్ లో ప్రతిపక్ష ఆర్జేడీ -కాంగ్రెస్ మహాకూటమికి ఆధిక్యంలో దూసుకెళ్తోంది. సీఎం అభ్యర్థిగా ప్రకటించిన తేజస్వి యాదవ్ కూడా తన నియోజకవర్గంలో లీడ్ లో ఉన్నారు.

Also Read: బీహార్ కా షేర్ తేజస్వి..మోడీ-నితీష్ కు షాక్ యేనా?

బీహార్ రాష్ట్రంలో మొత్తం 243 స్థానాలకు గాను 217 స్థానాల్లో కౌంటింగ్ ఫలితాలు తెలిసాయి. ఇందులో బీజేపీ-జేడీయూ 90 స్థానాల్లో లీడ్ లో ఉండగా.. ప్రతిపక్ష ఆర్జేడీ-కాంగ్రెస్ కూటమి124 కూటమి ఏకంగా 124 స్థానాల్లో ఆధిక్యంలో దూసుకుపోతుంది. ఆర్జేడీ ఖచ్చితంగా బీహార్ లో అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని ఫలితాల సరళిని బట్టి తెలుస్తోంది. ఎల్జేపీ 2 స్థానాల్లో ఇతరులు 1 స్థానాల్లో లీడ్ లో ఉన్నారు.

బీహార్ ఎన్నికల సరళి చూస్తే ఈసారి నితీష్-మోడీలకు షాక్ తప్పదన్న ఆలోచన కనిపిస్తోంది. వరుసగా గెలిపించిన నితీష్ పై ప్రజల్లో వ్యతిరేకత ఉందని.. అందుకే ప్రత్యర్థి ఆర్జేడీకి విజయం కట్టబెడుతున్నట్టు తెలుస్తుందని అర్థమవుతోంది.

Also Read: దుబ్బాకలో బీజేపీ లీడ్.. ఏం జరుగుతోంది

ఇక మధ్యప్రదేశ్ లో జరుగుతున్న ఉప ఎన్నికల్లో 28 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరిగింది. అందులో బీజేపీకి 5, కాంగ్రెస్ కు 4 సీట్లలో ఆధిక్యంలో ఉంది.

మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్