ఇండియా-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో టెస్టులో భారత ఆటగాళ్లు బాగా రాణిస్తున్నారు. మొదటిరోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా ఆసీస్‌పై ఆధిక్యం ప్రదర్శించింది. ఈ మ్యాచ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన రహనే ఆస్ట్రేలియాను తొలిరోజు కేవలం 195 పరుగులకే ఆస్ట్రేలియాను కట్టడి చేయగలిగాడు.
Also Read: ఈ దశాబ్ధపు ఉత్తమ సారథులు ధోని, కోహ్లీనే
ఇక రెండోరోజైన ఆదివారం వర్షం కారణంగా మ్యాచ్ మధ్యలోనే నిలిచిపోయింది. అయితే అంతకముందే భారత్ ఐదు వికట్ల నష్టానికి 277 పరుగుల అధిక్యాన్ని సాధించింది. భారత్ ప్రస్తుతం 82 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్‌లో రహానే సెంచరీతో ఆకట్టుకున్నాడు. 195 బంతుల్లో రహానే సెంచరీ పూర్తి చేసుకున్నాడు..
రహానె 104పరుగులతో జడేజా 40 పరుగులతో నాటౌట్‌గా ఉన్నారు. ఇక ఇదే మ్యాచులో భారత వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్ మెన్ రిషబ్ పంత్ ఆస్ట్రేలియాపై అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఆసీస్ పై వరుసగా ఎనిమిది ఇన్నింగ్స్ ల్లో 25.. అంతకంటే ఎక్కువ పరుగులు సాధించిన విదేశీ క్రికెటర్ గా రిషబ్ పంత్ నిలిచాడు.
Also Read: భారత్‌దే ఆధిపత్యం
2018లో భారత జట్టుకు ఎంపికైన రిషబ్ పంత్ అదే ఏడాది ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లాడు. అప్పుడు నాలుగు టెస్టులు ఆడిన పంత్ ఏడు ఇన్నింగ్స్‌ల్లో వరుసగా 25.. 28.. 36.. 30.. 39.. 33.. 159 పరుగులు చేశాడు. కాగా ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో రిషబ్ చోటు దక్కలేదు.
రెండో టెస్టులో రిషబ్ కు చోటుదక్కగా తొలి ఇన్నింగ్స్‌లో 29పరుగులు చేశాడు. దీంతో వరుసగా ఎనిమిది ఇన్నింగ్స్ ల్లో 25+ పరుగులు చేసిన విదేశీ బ్యాట్స్‌మెన్లలో పంత్ ఒకటిగా నిలిచాడు. ఇంగ్లాండ్స్ బ్యాట్స్‌మాన్ వాలీ హేమండ్.. విండిస్ బ్యాట్స్‌మెన్ వివియన్ రిచర్డ్స్ తర్వాత ఆస్ట్రేలియాపై ఈ ఘనత సాధించిన బ్యాట్స్‌మెన్ గా పంత్ అరుదైన రికార్డు సృష్టించాడు.