ప్రజలకు షాకింగ్ న్యూస్.. కారు ఉంటే రేషన్ కార్డ్ కట్..?

తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలకు ఈ వార్త షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. కారు ఉన్నా, మూడున్నర ఎకరాల కంటే భూమి ఉన్నా, ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తున్నా ప్రభుత్వం కొత్త రేషన్ కార్డును మంజూరు చేయదని తెలుస్తోంది. రాబోయే రోజుల్లో రేషన్ కార్డుల ఏరివేతలో పాత రేషన్ కార్డు కూడా పోయే అవకాశాలు అయితే ఉన్నాయి. తెలంగాణ సర్కార్ నియమనిబంధనల ప్రకారం దారి దారిద్ర రేఖకు దిగువన ఉన్నవాళ్లకు మాత్రమే రేషన్ ​కార్డులు ఇవ్వాలని ఆర్డర్లు వచ్చాయి. […]

Written By: Navya, Updated On : July 1, 2021 4:28 pm
Follow us on

తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలకు ఈ వార్త షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. కారు ఉన్నా, మూడున్నర ఎకరాల కంటే భూమి ఉన్నా, ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తున్నా ప్రభుత్వం కొత్త రేషన్ కార్డును మంజూరు చేయదని తెలుస్తోంది. రాబోయే రోజుల్లో రేషన్ కార్డుల ఏరివేతలో పాత రేషన్ కార్డు కూడా పోయే అవకాశాలు అయితే ఉన్నాయి. తెలంగాణ సర్కార్ నియమనిబంధనల ప్రకారం దారి దారిద్ర రేఖకు దిగువన ఉన్నవాళ్లకు మాత్రమే రేషన్ ​కార్డులు ఇవ్వాలని ఆర్డర్లు వచ్చాయి.

ప్రత్యేక సాఫ్ట్ వేర్ సహాయంతో తెలంగాణ సర్కార్ అనాలసిస్ చేస్తోందని అప్లికేషన్లలోని ఆధార్ ​నంబర్​ను ఎంటర్ చేసిన వెంటనే కారు ఉన్నవాళ్లకు, ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తున్న వాళ్లకు, మూడున్నర ఎకరాల కంటే భూమి ఉండి రైతుబంధు వస్తున్న రైతులకు రిజెక్టెడ్ అని వస్తోందని తెలుస్తోంది. ఆర్.ఐ, వీర్వోలు మిగిలిన అప్లికేషన్లను వెరిఫై చేస్తున్నారని సమాచారం అందుతోంది.

మూడు సంవత్సరాల క్రితం అర్హత ఉన్నవాళ్లకు కొత్త రేషన్ కార్డులు ఇస్తామని తెలంగాణ సర్కార్ ప్రకటన చేసింది. అప్పట్లో కొత్త రేషన్ కార్డుల కోసం 4.4 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. గైడ్​లైన్స్​కు విరుద్ధంగా ఉన్న అప్లికేషన్లన్నీ ఆటోమేటిక్​గా రిజెక్ట్ అవుతున్నాయని సమాచారం. అధికారులు కుటుంబంలో ఎవరికైనా ప్రభుత్వ ఉద్యోగం ఉందా..? అనే వివరాలను సైతం సేకరిస్తున్నారు.

కొత్త గైడ్​లైన్స్​ను కొత్త కార్డులకే పరిమితం చేస్తారా? అదే సాఫ్ట్​వేర్​ సాయంతో పాత కార్డులను ఏరివేస్తారా? అనే విషయం తెలియాల్సి ఉంది. ప్రభుత్వం ఇప్పటికే ఉన్న కార్డుల్లో మార్పుచేర్పులకు అవకాశం ఇవ్వడం లేదని అధికారులు చెబుతుండటం గమనార్హం.