వాట్సాప్ యూజర్లకు అలర్ట్.. ఈ యాప్ వాడితే ఖాతా బ్లాక్..?

దేశంలోని కోట్ల సంఖ్యలో ప్రజలు వాట్సాప్ యాప్ ను వినియోగిస్తున్న సంగతి తెలిసిందే. స్మార్ట్ ఫోన్ ను వాడే ప్రతి ఒక్కరూ వాట్సాప్ ను కచ్చితంగా ఉపయోగిస్తారు. అయితే వాట్సాప్ కు ఉన్న క్రేజ్ ను దృష్టిలో ఉంచుకుని కొంతమంది ఫేక్ యాప్స్ ను క్రియేట్ చేస్తున్నారు. జీబీ వాట్సాప్ పేరుతో ఒక యాప్ వాట్సాప్ లో లేని ఫీచర్లను అందిస్తూ ప్రచారంలోకి వచ్చింది. వాట్సాప్ ఈ ఏడాది తొలినాళ్లలో ప్రైవసీ రూల్స్ ను తెచ్చిన సంగతి […]

Written By: Kusuma Aggunna, Updated On : June 30, 2021 9:06 pm
Follow us on

దేశంలోని కోట్ల సంఖ్యలో ప్రజలు వాట్సాప్ యాప్ ను వినియోగిస్తున్న సంగతి తెలిసిందే. స్మార్ట్ ఫోన్ ను వాడే ప్రతి ఒక్కరూ వాట్సాప్ ను కచ్చితంగా ఉపయోగిస్తారు. అయితే వాట్సాప్ కు ఉన్న క్రేజ్ ను దృష్టిలో ఉంచుకుని కొంతమంది ఫేక్ యాప్స్ ను క్రియేట్ చేస్తున్నారు. జీబీ వాట్సాప్ పేరుతో ఒక యాప్ వాట్సాప్ లో లేని ఫీచర్లను అందిస్తూ ప్రచారంలోకి వచ్చింది. వాట్సాప్ ఈ ఏడాది తొలినాళ్లలో ప్రైవసీ రూల్స్ ను తెచ్చిన సంగతి తెలిసిందే.

ఆ సమయంలో జీబీ వాట్సాప్ పాపులారిటీని తెచ్చుకుంది. ఈ యాప్ లో వాట్సాప్ స్టేటస్ ను డౌన్ లోడ్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంది. అయితే ఈ యాప్ ను వాడేవాళ్లను వాట్సాప్ హెచ్చరించింది. ఈ థర్డ్ పార్టీ యాప్ ను ఇన్ స్టాల్ చేస్తే అన్ ఇన్ స్టాల్ చేయడం తేలిక కాదు. జీబీ వాట్సాప్ యాప్ వల్ల అనేక సెక్యూరిటీ సమస్యలు తలెత్తుతాయని వాట్సాప్ పేర్కొంది. గూగుల్​ ప్లే స్టోర్​లో గానీ, ఇతర ఆండ్రాయిడ్​ యాప్​ స్టోర్లలో కానీ జీబీ వాట్సాప్ దొరకదు.

ఈ యాప్ వల్ల డేటాకు సెక్యూరిటీ ఉండకపోవడంతో వాట్సాప్ హ్యాక్ అయ్యే అవకాశం ఉందని వాట్సాప్ సంస్థ చెబుతోంది. ఈ యాప్ ను ఇన్స్టాల్ చేసుకున్న వారి ఒరిజినల్ వాట్సాప్ ఖాతాను బ్లాక్ చేసే అవకాశం ఉంది. అందువల్ల ఎవరైనా జీబీ వాట్సాప్ ను ఇన్ స్టాల్ చేసుకుని ఉంటే వెంటనే డిలేట్ చేస్తే మంచిది. లేకపోతే మాత్రం ఈ యాప్ వల్ల నష్టపోయే అవకాశం ఉంది.

మరోవైపు ప్రైవసీకి పెద్ద పీట వేస్తున్న వాట్సాప్ వ్యూ వన్స్ పేరుతో ప్రైవసీ ఫ్రెండ్లీ ఫీచర్ ను తెచ్చింది. మనం ఇతరులకు ఏం పంపినా అవతలి వ్యక్తి ఒకసారి చూడటమే ఈ ఫీచర్ యొక్క ప్రత్యేకత. యూజర్లకు ఈ ఫీచర్ వల్ల ఎంతో ప్రయోజనం చేకూరనుందని చెప్పవచ్చు.