హైదరాబాద్ మేయర్ ను వదలని వర్మ.. ట్వీట్ వైరల్

వివాదాస్పద రాంగోపాల్ వర్మకు వివాదాలు లేనిదే పూటగడవని పరిస్థితి.. ఎప్పుడూ ఏదో వివాదాన్ని కెలికి మరీ ఆయన అంటించుకుంటారు. ఎవరో ఒకరిపై ఏదో అననిది ఆయనకు నిద్ర పట్టదు అనుకుంటా. తాజాగా హైదరాబాద్ మేయర్ ను టార్గెట్ చేసి వర్మ హాట్ కామెంట్స్ చేశారు. హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మీ ఓ చేత్తో కుక్కకు చపాతీ తినిపిస్తూ మరో చేత్తో తాను తింటున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో అటు తిరిగి […]

Written By: NARESH, Updated On : March 5, 2021 4:55 pm
Follow us on

వివాదాస్పద రాంగోపాల్ వర్మకు వివాదాలు లేనిదే పూటగడవని పరిస్థితి.. ఎప్పుడూ ఏదో వివాదాన్ని కెలికి మరీ ఆయన అంటించుకుంటారు. ఎవరో ఒకరిపై ఏదో అననిది ఆయనకు నిద్ర పట్టదు అనుకుంటా. తాజాగా హైదరాబాద్ మేయర్ ను టార్గెట్ చేసి వర్మ హాట్ కామెంట్స్ చేశారు.

హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మీ ఓ చేత్తో కుక్కకు చపాతీ తినిపిస్తూ మరో చేత్తో తాను తింటున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో అటు తిరిగి ఇటుతిరిగి ఆర్జీవీ కంట పడింది. దీంతో వర్మ ఊరుకుంటాడా? కామెంట్ చేసేశాడు.

వర్మ తాజాగా వరుసగా మూడు ట్వీట్లు చేసి మేయర్ వీడియోను షేర్ చేస్తూ కామెంట్ చేశాడు. కుక్కపై మేయర్ ప్రేమ ఉన్నతంగా ఉందని.. కుడిచేత్తో కుక్కకు తినిపిస్తూ ఎడమ చేత్తో తాను తింటున్నారని.. ఈమెను అంతర్జాతీయ కుక్కల మేయర్ గా ఎంపిక చేయాలని వర్మ డిమాండ్ చేశారు. కుక్కపై చూపిన ప్రేమ ప్రజలపై చూపిస్తే వచ్చే జన్మలో కుక్కలా పుడతానంటూ వర్మ ట్వీట్ చేశాడు.

ఈ ట్వీట్ తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొందరు మేయర్ కు మద్దతుగా ట్వీట్ చేస్తూ.. కొందరు వ్యతిరేకంగా కామెంట్ చేస్తున్నారు. రెండు రోజులుగా ఈ వీడియో మాత్రం తెగ చర్చనీయాంశమైంది.

https://twitter.com/RGVzoomin/status/1367172171676610561?s=20