https://oktelugu.com/

ఒక్క హిట్ కే కోటి అడుగుతుందట !

తెలుగు వెండితెర పై ప్రతీ ఏడాది బోలెడంత మంది అందగత్తెలు వస్తూనే ఉన్నా.. కొందరికి మాత్రమే తెలుగు సినీ లోకం నీరాజనాలు పలుకుతొంది. అలా నీరాజనాలు అందుకునే ప్రతి భామ గొప్ప అందగత్తే కానక్కర్లేదు. ఈ జాబితాలోకే వస్తోంది కన్నడ భామ ‘కృతి శెట్టి’. తానూ మంచి నటీ అని ఒక్క సినిమాతోనే నిరూపించుకుంది ఈ భామ. దాంతో, వరుస ఆఫర్స్ వస్తున్నాయి. నిజానికి తొలి సినిమా విడుదల కాకుండానే ఫుల్ క్రేజ్ తెచ్చుకోవడం అంటే ఈ […]

Written By: , Updated On : March 5, 2021 / 04:56 PM IST
Follow us on

Krithi Shetty
తెలుగు వెండితెర పై ప్రతీ ఏడాది బోలెడంత మంది అందగత్తెలు వస్తూనే ఉన్నా.. కొందరికి మాత్రమే తెలుగు సినీ లోకం నీరాజనాలు పలుకుతొంది. అలా నీరాజనాలు అందుకునే ప్రతి భామ గొప్ప అందగత్తే కానక్కర్లేదు. ఈ జాబితాలోకే వస్తోంది కన్నడ భామ ‘కృతి శెట్టి’. తానూ మంచి నటీ అని ఒక్క సినిమాతోనే నిరూపించుకుంది ఈ భామ. దాంతో, వరుస ఆఫర్స్ వస్తున్నాయి. నిజానికి తొలి సినిమా విడుదల కాకుండానే ఫుల్ క్రేజ్ తెచ్చుకోవడం అంటే ఈ జనరేషన్ లో అది ఒక్క కృతి శెట్టికే సాధ్యం అయింది అనుకుంటా.

Also Read: క్రికెటర్ పెళ్లి.. అందరి చూపు ఆ హీరోయిన్ పైనే !

మొత్తానికి తన నటనతో ఇండస్ట్రీని ఊపేయడానికి వచ్చినట్లే ఉంది ఈ అమ్మడు. ఇప్పటికే నాని సినిమాలో కూడా నటిస్తోంది. ‘టాక్సీవాలా’ ఫేమ్ దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్, నాని కాంబినేషన్‌లో వస్తోన్న ‘శ్యామ్ సింగరాయ్‌’లో కృతి శెట్టిది మెయిన్ రోల్ అట. అలాగే ఇంద్ర‌గంటి మోహ‌న కృష్ణ డైరెక్ష‌న్ లో ఓ సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. ఈ సినిమా అయితే ఏకంగా మొత్తం ఈ బ్యూటీ మీదే నడుస్తోందట. టైటిల్ కూడా ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ అనే ఆసక్తికరంగా పెట్టారు. తన పాత్ర మీదే టైటిల్‌ ను ఫైన‌ల్ చేశారంటే.. సినిమాలో కృతి శెట్టికి ఇచ్చిన ప్రాముఖ్యత అర్ధమవుతుంది.

Also Read: ఇండస్ట్రీలో ఇప్పుడు ఒక్కటే టాపిక్ !

పైగా ప్రస్తుతం టాప్ హీరోయిన్ ల లిస్ట్ కూడా తక్కువగా ఉండటం.. ఉన్న హీరోయిన్స్ లో పెద్దగా పోటీ ఇచ్చే వారే లేకపోవడం.. మొత్తానికి కృతి శెట్టికి టైం కలిసి వచ్చింది. అందుకే ఈ బ్యూటీ ఒక్కో సినిమాకి సుమారు రూ. కోట్ల వరకు డిమాండ్ చేస్తోందట. దీనికి తోడు తన మేకప్ అండ్ తన సెటప్ ఖర్చులు కోసం అదనంగా రోజుకు లక్ష రూపాయలు డిమాండ్ చేస్తోందట. తన డిమాండ్ ను అర్ధం చేసుకున్న కృతి శెట్టి.. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే ఫార్ములాను పక్కాగా ఫాలో అవుతుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్