విరాటపర్వం టీజర్ టాక్ : నక్సలైట్ రవన్నగా రానా

హీరో రానా బర్త్ డే సందర్భంగా విడుదలైన ‘విరాటపర్వం’ మూవీ టీజర్ ఆకట్టుకుంది. 1990వ దశకంలో నక్సలైట్ రవన్నగా రానా కనిపించారు. నక్సల్స్ ఉద్యమం ఉధృతంగా సాగిన నేపథ్యంలో జరిగిన ఘటనల ఆధారంగా యాథార్థ స్టోరీని సినిమాగా మలిచినట్టు తెలుస్తోంది. తాజాగా ఈ సినిమా టీజర్ ను విడుదల చేశారు. డాక్టర్ రవిశంకర్ అలియాస్ కామ్రేడ్ రవన్నగా రానా ఒక నక్సలైట్ పాత్రను పోషించారు. దట్టమైన అడవి.. అందులో రానా, నక్సలైట్లు, రోమాలు నిక్కబొడిచేలా బ్యాక్ గ్రౌండ్ […]

Written By: NARESH, Updated On : December 14, 2020 12:33 pm
Follow us on

హీరో రానా బర్త్ డే సందర్భంగా విడుదలైన ‘విరాటపర్వం’ మూవీ టీజర్ ఆకట్టుకుంది. 1990వ దశకంలో నక్సలైట్ రవన్నగా రానా కనిపించారు. నక్సల్స్ ఉద్యమం ఉధృతంగా సాగిన నేపథ్యంలో జరిగిన ఘటనల ఆధారంగా యాథార్థ స్టోరీని సినిమాగా మలిచినట్టు తెలుస్తోంది.

తాజాగా ఈ సినిమా టీజర్ ను విడుదల చేశారు. డాక్టర్ రవిశంకర్ అలియాస్ కామ్రేడ్ రవన్నగా రానా ఒక నక్సలైట్ పాత్రను పోషించారు. దట్టమైన అడవి.. అందులో రానా, నక్సలైట్లు, రోమాలు నిక్కబొడిచేలా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో ఒక్క డైలాగ్ లేకుండా కేవలం మావోయిస్టుల నాటి సంఘటనలతో సినిమాను నింపినట్టు టీజర్ ను చూస్తే అర్థమవుతోంది.

టీజర్ చూస్తే ఖచ్చితంగా సినిమా మీద అంచనాలు పెంచేలా ఉంది. హీరోయిన్ సాయి పల్లవిని టీజర్ లో చూపించకపోవడం విశేషం.

తమకు జరిగిన అన్యాయంపై బదులు తీర్చుకునే ఒక వ్యక్తి నక్సలైట్ గా మారి అజ్ఞాతవాసంలో తన ప్రత్యర్థులను చంపినట్టు తెలుస్తోంది.

వేణు ఉడుగుల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సురేష్ బాబు సమర్పిస్తున్నారు. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. సురేష్ బొబ్బలి సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో ప్రియమణి, నందితాదాస్, నవీన్ చంద్ర, జరీనా వహాబ్, ఈశ్వరిరావు, సాయి చంద్ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు.