https://oktelugu.com/

అఖిల్-మోనాల్ పెళ్లి… వారం తర్వాత ప్రకటన?

బిగ్ బాస్ ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురుచూస్తున్న సీజన్ 4 టైటిల్ విన్నర్ ఎవరో వచ్చే వారం తేలిపోనుంది. బిగ్ బాస్ సీజన్ 4 గ్రాండ్ ఫినాలే వచ్చే వారం జరగనుంది. టాప్ ఫైవ్ కంటెస్ట్స్ గా అరియనా, అభిజిత్, అఖిల్, సోహెల్ మరియు హారిక మిగిలారు. మోనాల్ ఎలిమినేషన్ తో ఫైనలిస్ట్స్ హోదాలో మిగిలిన ఐదుగురు సభ్యులు పార్టీ చేసుకున్నారు. Also Read: హౌస్ లో ఆడ-మగ తేడా లేదా… ఏం మెసేజ్ ఇస్తున్నావ్ నాగ్ ? […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 14, 2020 / 12:25 PM IST
    Follow us on


    బిగ్ బాస్ ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురుచూస్తున్న సీజన్ 4 టైటిల్ విన్నర్ ఎవరో వచ్చే వారం తేలిపోనుంది. బిగ్ బాస్ సీజన్ 4 గ్రాండ్ ఫినాలే వచ్చే వారం జరగనుంది. టాప్ ఫైవ్ కంటెస్ట్స్ గా అరియనా, అభిజిత్, అఖిల్, సోహెల్ మరియు హారిక మిగిలారు. మోనాల్ ఎలిమినేషన్ తో ఫైనలిస్ట్స్ హోదాలో మిగిలిన ఐదుగురు సభ్యులు పార్టీ చేసుకున్నారు.

    Also Read: హౌస్ లో ఆడ-మగ తేడా లేదా… ఏం మెసేజ్ ఇస్తున్నావ్ నాగ్ ?

    చివరి ఎలిమినేషన్ ప్రక్రియ ఉత్కంఠగా సాగింది. అరియనా, మోనాల్ ఫైనలిస్ట్ బెర్త్ కోసం పోటీపడగా ప్రేక్షకులు తమ ఓట్లతో అరియనాను ఫైనల్ కి పంపించారు. కాగా మోనాల్ ఎలిమినేషన్ తో హౌస్ లో ఓ ఎమోషనల్ లవ్ డ్రామా చోటు చేసుకుంది. మోనాల్ ఎలిమినేషన్ తట్టుకోలేని అఖిల్ కూలబడిపోయాడు. అతడు చాలా సేపు షాక్ లో ఉండిపోయాడు. ఐతే మోనాల్ మాత్రం వెళుతూ వెళుతూ టైట్ హగ్స్ తో అఖిల్ ని ఓదార్చే ప్రయత్నం చేసింది.

    Also Read: ఏడిస్తే ఓట్లు వేస్తారా..? డ్రామాలు చేస్తే ఆదరిస్తారా..?

    బిగ్ బాస్ వేదికపైకి వచ్చిన మోనాల్… ఇంటి సభ్యులు అందరికీ సలహాలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా అఖిల్ మరియు మోనాల్ మధ్య ఆసక్తికర సంభాషణ సాగింది. ‘ఒక్క వారమే బయటికి వచ్చేస్తా మనం మాట్లాడుకుందాం’ అని అఖిల్ అనగా మోనాల్ ఒకే అన్నారు. బయటికి వచ్చాక ఏం మాట్లాడుకుంటారని నాగార్జున అడుగగా… ఇద్దరు సిగ్గు పడ్డారే కానీ విషయం చెప్పలేదు. బిగ్ బాస్ హౌస్ లో ఘాడమైన ప్రేమ బంధం కొనసాగించిన అఖిల్-మోనాల్ పెళ్లి చేసుకోవడం ఖాయమన్న మాట గట్టిగా వినిపిస్తుంది. హౌస్ నుండి బయటికి వచ్చాక అఖిల్ దీనిపై క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్