మెగా ఫ్యామిలీకి మొత్తం ఆరాధ్యుడు మెగా స్టార్ చిరంజీవి. ఆయన చెట్టునీడనే ఇప్పుడు ఏడు ఎనిమిది మంది మెగా హీరోలు పుట్టుకొచ్చారు. ఇండస్ట్రీని ఏలుతున్నారు. చిరంజీవి, పవన్, రాంచరణ్, అల్లు అర్జున్ లు స్టార్ హీరోలుగా తెలుగు చిత్రపరిశ్రమలో ఉన్నారు. మిగతా వారు మోస్తారుగా రాణిస్తున్నారు.
Also Read: ‘ఆచార్య’లో మరో పవర్ ఫుల్ విలన్.. ఎవరో తెలుసా?
మెగా కుటుంబానికి పెద్దదిక్కు.. అందరికీ దారిచూపే చిరంజీవి పెళ్లిరోజు నేడు. అందుకే తన తల్లిదండ్రులకు సోషల్ మీడియా ద్వారా వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్.
42వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న చిరంజీవి-సురేఖ దంపతులకు వారి కుమారుడు రాంచరణ్ విషెస్ తెలియజేశాడు.
Also Read: నితిన్ దూకుడు.. మరో సినిమా రిలీజ్ డేట్
1980 ఫిబ్రవరి 20న చిరంజీవి, సురేఖల వివాహం జరిగింది. నేటితో 42 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ క్రమంలోనే వారిద్దరి ఓ అరుదైన ఫొటోను షేర్ చేసిన రాంచరణ్ ఈ సందర్భంగా ‘నా అతిపెద్ద బలం మీరే. మీ ఇద్దరికీ 42వ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ’ అని రాంచరణ్ ట్వీట్ చేశాడు.
My biggest strength!!
Wishing you both a very Happy 42nd wedding anniversary 😜❤️!!@KChiruTweets pic.twitter.com/RjFyoPUbCN— Ram Charan (@AlwaysRamCharan) February 20, 2021