https://oktelugu.com/

రామతీర్థం రణరంగం: సోము వీర్రాజు అరెస్ట్.. ఉద్రిక్తత

ఏపీ బీజేపీ అధ్యక్షుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. రామతీర్థంకు వెళుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విజయనగరం జిల్లాలో కోదండరామస్వామి విగ్రహ ధ్వంసం ఘటనకు నిరసనగా బీజేపీ, జనసేన తలపెట్టిన రామతీర్థ ధర్మయాత్ర ఉద్రిక్తంగా మారింది. Also Read: సెలవులంటే ఆ అధికారికి భయం పట్టుకుంది బీజేపీ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు సిద్ధమవ్వగా ఇప్పటికే కొందరినీ గృహనిర్బంధం చేశవారు. రామతీర్థం వెళ్లకుండా ఆ గ్రామ కూడలి వద్ద పోలీసులు మోహరించారు. అక్కడికి వచ్చిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు […]

Written By: , Updated On : January 5, 2021 / 11:37 AM IST
Follow us on

Somu Veerraju arrested

ఏపీ బీజేపీ అధ్యక్షుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. రామతీర్థంకు వెళుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విజయనగరం జిల్లాలో కోదండరామస్వామి విగ్రహ ధ్వంసం ఘటనకు నిరసనగా బీజేపీ, జనసేన తలపెట్టిన రామతీర్థ ధర్మయాత్ర ఉద్రిక్తంగా మారింది.

Also Read: సెలవులంటే ఆ అధికారికి భయం పట్టుకుంది

బీజేపీ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు సిద్ధమవ్వగా ఇప్పటికే కొందరినీ గృహనిర్బంధం చేశవారు. రామతీర్థం వెళ్లకుండా ఆ గ్రామ కూడలి వద్ద పోలీసులు మోహరించారు.

అక్కడికి వచ్చిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజును పోలీసులు అడ్డుకున్నారు. సెక్షన్ 30 అమల్లో ఉన్నందున ఎలాంటి ర్యాలీలు నిర్వహించకూడదని పోలీసులు ఆదేశించారు.

ఇందులో భాగంగానే సోము వీర్రాజును ముందస్తుగా అరెస్ట్ చేసినట్లు తెలిపారు. సోము వీర్రాజుతోపాటు పలువురు బీజేపీ నాయకులను కూడా అదుపులోకి తీసుకొని నెల్లిమర్ల పోలీస్ స్టేషన్ కు తరలించారు.

Also Read: ఏపీలో ఆలయాల యాత్ర..: చినజీయర్‌‌ పిలుపు

సోము వీర్రాజును అడ్డుకోవడంతో బీజేపీ కార్యకర్తలకు, పోలీసులకు తీవ్రవాగ్వాదం తోపులాట జరిగింది. పోలీసుల తీరుకు నిరసనగా బీజేపీ, జనసేన కార్యకర్తలు రోడ్డుపై భైటాయించి నిరసన తెలిపారు.

రామతీర్థం ధర్మయాత్రకు ముందుగానే పిలుపునిచ్చినప్పటికీ పోలీసులు అనుమతి లేకుండా అడ్డుకోవడం దారుణమన్నారు. ఆలయ సందర్శనకు అనుమతిచ్చినట్టు చెప్పి ఇప్పుడు ఎందుకు అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ, టీడీపీ నాయకులను రామతీర్థం వెళ్లనిచ్చి తమను ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్