RGV crazy: రామ్ గోపాల్ వర్మ (RGV).. వివాదానికి కేంద్ర బిందువు. వర్మలో ఈ మధ్య బాగా పైత్యం ముదిరిపోయింది. వయసు పెరిగిన ప్రభావమో లేక, వర్మలో విపరీత చేష్టల ప్రభావమో గాని.. వర్మలో కోరికలు రోజురోజుకు ఎక్కువైపోతున్నాయి. ఏడాదికి తక్కువ అరవైలో ఉన్న వర్మలో ఇలాంటి కోరికలు ఏమిటో వర్మకే తెలియాలి. అమ్మాయిలతో సరదాలను ఆస్వాదిస్తూ ముందుకు పోతున్నాడు వర్మ.
సోషల్ మీడియాలో వర్మ పోస్ట్ చేసిన వీడియో ఒకటి వైరల్ అవ్వడానికి తెగ తాపత్రయ పడుతుంది. ఆ వీడియోలో వర్మ ప్రపంచాన్ని మరిచిపోయి.. కొత్త భామ ఇనియా సుల్తానాతో (Inaya Sultana) కలిసి వేసిన స్టెప్స్.. ఆ సమయంలో ఆమెను వర్మ పట్టుకుని ఊగిన విధానం, అన్నిటికీ మించి ఆమె కాళ్ళ ముందు కామంతో బోర్ల పడటం వంటి చర్యలు.. అబ్బో మొత్తానికి వర్మ విజయవంతంగా తన పిచ్చిని పీక్స్ కి తీసుకువెళ్లాడు.
ఇక్కడ మన కర్మ ఏమిటంటే.. ఈ వీడియో బాగోతాన్ని వర్మ స్వయంగా తన ట్విట్టర్ లో ట్విట్టాడు. వీడియోలో వల్గారిటీ ఉంటే.. సహజంగా దాన్ని వైరల్ చేయడానికి మన నెటిజన్లు పోటీ పడతారు కాబట్టి, ఈ వీడియో కూడా ప్రస్తుతం బాగా వైరల్ అవుతుంది. అయితే, వైరల్ అవడంతో పాటు వర్మ పై ట్రోలింగ్ కూడా పీక్ లో సాగుతుంది.
ఈ క్రమంలో వర్మను అడ్డమైన తిట్లు తిడుతూ నెటిజన్లు రెచ్చిపోతున్నారు. ‘వర్మ నీ ఏజ్, గేజ్ మర్చిపోయావా?’ అంటూ ఒకరు, నీ కామ పిచ్చికి లేదు పరిమితి అంటూ మరొకరు’ ఇలా రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. ఐతే కొంతమంది మాత్రం వర్మకి సపోర్ట్ చేస్తూ ఉండటం విశేషం. వాళ్లిద్దరూ ఇష్టపడితే తప్పు ఏముంది ? అంటూ మరికొందరు అంటున్నారు.
అయినా ఇష్టంతో వాళ్ళు డ్యాన్స్ చేసుకుంటే… మనం ఎందుకు అభ్యంతర చెప్పాలి ? అంటూ వర్మ పై తమ అభిమానాన్ని చూపిస్తున్నారు. కాకపోతే ఇక్కడ ప్రస్తావించాల్సిన అంశం ఏమిటంటే.. ఈ కొత్త భామ నిజంగా ఇష్టపడి డ్యాన్స్ చేసిందా ? లేక ఈ వివాదాల వర్మ తనకు ఛాన్స్ లు ఇస్తాడనే ఆశతో కాంప్రమైజ్ అయిందా ? అనేదే డౌట్. అయితే, తన జీవితంలో ఇది మర్చిపోలేని రోజు అంటూ ఆ అమ్మడే ఒక పోస్ట్ పెట్టడం విశేషం.
I once again want to clarify that the guy in this video is not me and the Girl in Red is not @inaya_sultana and I swear this on American President JOE BIDEN pic.twitter.com/K8nNera7Rc
— Ram Gopal Varma (@RGVzoomin) August 22, 2021
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Ram gopal varmas controversies
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com