https://oktelugu.com/

రాజమౌళి మెచ్చిన టీజర్.. చూస్తే షేకింగ్

దర్శక ధీరుడు రాజమౌళి దగ్గర సహాయకుడిగా పనిచేసిన అశ్విన్ గంగరాజు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆకాశవాణి’. ఎంఎం కీరవాణి తనయుడు కాలభైరవ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా టీజర్ ను డైరెక్టర్ ను తాజాగా రాజమౌళి శుక్రవారం రిలీజ్ చేశాడు. పచ్చని ప్రకృతి, గిరిజనుల మధ్యలో టీజర్ ఆకట్టుకునేలా ఉంది. చెట్టు పూట్టను నమ్ముకునే అడవి బిడ్డల కథలను, వ్యథలను కళ్లకు కట్టినట్టుగా చెప్పే ప్రయత్నం ఈ సినిమా అనిపిస్తోంది. ఈ టీజర్ లో డైలాగ్ లు […]

Written By:
  • NARESH
  • , Updated On : March 5, 2021 / 09:10 PM IST
    Follow us on

    దర్శక ధీరుడు రాజమౌళి దగ్గర సహాయకుడిగా పనిచేసిన అశ్విన్ గంగరాజు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆకాశవాణి’. ఎంఎం కీరవాణి తనయుడు కాలభైరవ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా టీజర్ ను డైరెక్టర్ ను తాజాగా రాజమౌళి శుక్రవారం రిలీజ్ చేశాడు.

    పచ్చని ప్రకృతి, గిరిజనుల మధ్యలో టీజర్ ఆకట్టుకునేలా ఉంది. చెట్టు పూట్టను నమ్ముకునే అడవి బిడ్డల కథలను, వ్యథలను కళ్లకు కట్టినట్టుగా చెప్పే ప్రయత్నం ఈ సినిమా అనిపిస్తోంది.

    ఈ టీజర్ లో డైలాగ్ లు ఒక్కటే ఉండడం విశేషం. చూడమూచ్చటైన గ్రామీణ అందాలు ఇందులో ఉన్నాయి. బాలుడడు ఊడకు వేలాడుతున్న రేడియో .. పల్లెటూరి వాతావరణం ఆకట్టుకుంది.

    ఈ టీజర్ పై ప్రశంసలు కురిపించారు రాజమౌళి. ఇది మన చిన్నప్పటి స్మృతులను గుర్తు చేస్తుందని టీజర్ అందుకే రాజమౌళి నుంచే కాదు.. బయట వ్యక్తుల నుంచి కూడా ఈ టీజర్ ప్రశంసలు కురుస్తున్నాయి.