https://oktelugu.com/

ఇల్లు కొనాలనుకునే వారికి శుభవార్త.. భారీగా తగ్గిన వడ్డీరేట్లు..?

దేశంలోని ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రైవేట్ రంగ బ్యాంకులు కొత్తగా ఇల్లు కొనుగోలు చేయాలనుకునే వారికి అదిరిపోయే శుభవార్త చెప్పాయి. కొత్తగా ఇల్లు కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది శుభవార్త అనే చెప్పాలి. ఇంటి రుణాల వడ్డీరేట్లు ఏకంగా 15 సంవత్సరాల కనిష్ట స్థాయికి చేరడం గమనార్హం. బ్యాంకులు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల కొత్తగా ఇల్లు కొనుగోలు చేసేవారిపై భారీగా భారం తగ్గనుంది. Also Read: టీవీలు కొనేవాళ్లు షాకింగ్ న్యూస్.. భారీగా పెరగనున్న […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : March 6, 2021 3:20 pm
    Follow us on

    Home Loans

    దేశంలోని ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రైవేట్ రంగ బ్యాంకులు కొత్తగా ఇల్లు కొనుగోలు చేయాలనుకునే వారికి అదిరిపోయే శుభవార్త చెప్పాయి. కొత్తగా ఇల్లు కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది శుభవార్త అనే చెప్పాలి. ఇంటి రుణాల వడ్డీరేట్లు ఏకంగా 15 సంవత్సరాల కనిష్ట స్థాయికి చేరడం గమనార్హం. బ్యాంకులు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల కొత్తగా ఇల్లు కొనుగోలు చేసేవారిపై భారీగా భారం తగ్గనుంది.

    Also Read: టీవీలు కొనేవాళ్లు షాకింగ్ న్యూస్.. భారీగా పెరగనున్న ధరలు..?

    ప్రముఖ బ్యాంకులన్నీ వడ్డీ రేట్లు తగ్గించడంతో ఇల్లు కొనుగోలు చేయాలనుకునేవారికి ఇదే సరైన సమయమని చెప్పవచ్చు. ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ లలో ఒకటైన ఐసీఐసీఐ 75 లక్షల వరకు ఇంటి రుణంపై వడ్డీరేటును 6.70 శాతానికి తగ్గిస్తున్నట్టు ప్రకటన చేసింది. ఐసీఐసీఐ వడ్డీ రేట్లు గడిచిన పదేళ్లలో ఇంత తక్కువగా ఉండటం ఇదే తొలిసారి అని తెలుస్తోంది. 2021 మార్చి 31 వరకు సవరించిన వడ్డీరేట్లు అందుబాటులో ఉంటాయి.

    Also Read: పోస్టాఫీస్ సూపర్ స్కీమ్.. లక్ష పెట్టుబడికి రూ.40 వేల వడ్డీ..?

    75 లక్షల పై బడిన రుణాలకు మాత్రం వడ్డీరేటు 6.75 శాతం కన్నా ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది. దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, కొటక్ మహీంద్ర బ్యాంకులు కూడా గృహ రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించాయి. కొత్తగా ఇంటి రుణాలు తీసుకునే వారికి మాత్రమే తగ్గించిన వడ్డీ రేట్లు అమలు కానున్నాయి. ఎస్బీఐ యోనో యాప్ ద్వారా 30 లక్షల వరకు ఇంటి రుణం తీసుకునే ఉద్యోగినులకు వడ్డీరేట్లను 6.6 శాతానికి పరిమితం చేసింది.

    మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం

    కొన్ని బ్యాంకులు మాత్రం పాత రుణగ్రహీతలకు కూడా తగ్గించిన వడ్డీరేట్లను అమలు చేస్తుండటం గమనార్హం. కొత్తగా రుణం తీసుకోవాలని భావించే వాళ్లు సమీపంలోని బ్యాంకును సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.