spot_img
Homeఅత్యంత ప్రజాదరణమా నాన్న ద‌గ్గ‌రుండి ఆయ‌న‌కు ముద్దుపెట్టించారుః పూజా

మా నాన్న ద‌గ్గ‌రుండి ఆయ‌న‌కు ముద్దుపెట్టించారుః పూజా

Pooja Bhatt
సినిమాల్లో ఇవాళ లిప్ లాకులు కామ‌న్‌. మ‌రీ అంత సీరియ‌స్ గా తీసుకునే విష‌యం కాదు. కానీ.. 1991లో ప‌రిస్థితి ఎలా ఉండేదీ? క‌నీసం బుగ్గ‌మీద ముద్దు పెట్ట‌డం కూడా అప్ప‌ట్లో పెద్ద విష‌యంగా చూసేవారు. అలాంటి టైమ్ లో హీరోతో లిప్ లాక్ వేయాలంటే హీరోయిన్ కు ఎంత‌టి గ‌ట్స్ ఉండాలి? అది లేక చాలా ఇబ్బంది ప‌డిన‌ట్టు తెలిపింది అప్ప‌టి న‌టి పూజాభ‌ట్‌.

ఈమె బాలీవుడ్ దిగ్గ‌జ‌ ద‌ర్శ‌కుడు మ‌హేష్ భ‌ట్ కూతురు. త‌న‌కు ప‌ద్దెనిమిదేళ్ల వ‌య‌సు ఉన్న‌ప్పుడే ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టింది. అంతేకాదు.. అప్ప‌ట్లో స్టార్ హీరోగా ఉన్న సంజ‌య్ ద‌త్ స‌ర‌స‌న న‌టించే ఛాన్స్ కొట్టేసింది పూజా భ‌ట్‌.

అయితే.. ఆ సినిమాలో సంజ‌య్ తో లిప్ లాక్ చేయాల్సిన సీన్ ఉంది. ఈ ప‌ద్దెనిమిదేళ్ల అమ్మాయి.. అంద‌రూ చూస్తుండ‌గా లిప్ లాక్ ఇవ్వ‌డానికి చాలా ఇబ్బంది ప‌డింది. ఎన్నిసార్లు ప్ర‌య‌త్నించినా.. ఆ షాట్ స‌రిగా రాలేదు. దీంతో.. ఆ చిత్ర ద‌ర్శ‌కుడు, త‌న తండ్రి అయిన మ‌హేష్ భ‌ట్ పూజాను ద‌గ్గ‌ర‌కు పిలిచి, ఎలా చేయాలో చెప్పాడ‌ట‌.

దానికి ముందు ఆమె బ్రెయిన్ వాష్ చేశాడ‌ట‌. ‘ఇది సినిమా. నిజ‌జీవితం కాదు. ముద్దు సీన్‌ నువ్వు అస‌భ్య‌క‌రంగా ఫీల‌వుతూ చేస్తే.. తెర‌పైన కూడా అలాగే అగుపిస్తుంది. ఈ సీన్ చూసే ప్రేక్ష‌కులకు అది వ‌ల్గ‌ర్ గానే క‌నిపిస్తుంది.’ అని చెప్పారట.

దీంతో.. ఆమెకు అసలు విషయం అర్థమైంది. ఆ త‌ర్వాత కెమెరా ముందుకు వెళ్లి, లిప్ లాక్ సీన్లో చక్క‌గా న‌టించింద‌ట పూజా. ఆ విధంగా త‌న తండ్రి ప‌క్క‌న ఉండి సంజ‌య్ ద‌త్ కు ముద్దు పెట్టించిన విష‌యం ఇటీవ‌ల వెల్ల‌డించింది పూజా భ‌ట్‌.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Most Popular

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...

The Odyssey Box Office : ‘ది ఒడిస్సీ’ మొదటి వారం వరల్డ్ వైడ్ వసూళ్లు.. అవతార్ రికార్డ్స్...

The Odyssey Box Office : భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి సెన్సేషన్ ని సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం. నిన్నగాక...

Akhil Akkineni : ముద్దు అడిగిన యంగ్ హీరోయిన్.. వార్నింగ్ ఇచ్చిన అఖిల్.. వీడియో వైరల్..

Akhil Akkineni : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ గా నిల్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అఖిల్...

Lenin 2 Weeks Collections: ‘లెనిన్’ 2 వారాల వరల్డ్ వైడ్ వసూళ్లు.. టార్గెట్ కి ఆమడదూరం లో...

Lenin 2 Weeks Collections: అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' చూస్తూ ఉండగానే 2 వారాల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. అక్కినేని అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ, మొదటి...
Oktelugu Epaper
Exit mobile version