
సినిమాల్లో ఇవాళ లిప్ లాకులు కామన్. మరీ అంత సీరియస్ గా తీసుకునే విషయం కాదు. కానీ.. 1991లో పరిస్థితి ఎలా ఉండేదీ? కనీసం బుగ్గమీద ముద్దు పెట్టడం కూడా అప్పట్లో పెద్ద విషయంగా చూసేవారు. అలాంటి టైమ్ లో హీరోతో లిప్ లాక్ వేయాలంటే హీరోయిన్ కు ఎంతటి గట్స్ ఉండాలి? అది లేక చాలా ఇబ్బంది పడినట్టు తెలిపింది అప్పటి నటి పూజాభట్.
ఈమె బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు మహేష్ భట్ కూతురు. తనకు పద్దెనిమిదేళ్ల వయసు ఉన్నప్పుడే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. అంతేకాదు.. అప్పట్లో స్టార్ హీరోగా ఉన్న సంజయ్ దత్ సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది పూజా భట్.
అయితే.. ఆ సినిమాలో సంజయ్ తో లిప్ లాక్ చేయాల్సిన సీన్ ఉంది. ఈ పద్దెనిమిదేళ్ల అమ్మాయి.. అందరూ చూస్తుండగా లిప్ లాక్ ఇవ్వడానికి చాలా ఇబ్బంది పడింది. ఎన్నిసార్లు ప్రయత్నించినా.. ఆ షాట్ సరిగా రాలేదు. దీంతో.. ఆ చిత్ర దర్శకుడు, తన తండ్రి అయిన మహేష్ భట్ పూజాను దగ్గరకు పిలిచి, ఎలా చేయాలో చెప్పాడట.
దానికి ముందు ఆమె బ్రెయిన్ వాష్ చేశాడట. ‘ఇది సినిమా. నిజజీవితం కాదు. ముద్దు సీన్ నువ్వు అసభ్యకరంగా ఫీలవుతూ చేస్తే.. తెరపైన కూడా అలాగే అగుపిస్తుంది. ఈ సీన్ చూసే ప్రేక్షకులకు అది వల్గర్ గానే కనిపిస్తుంది.’ అని చెప్పారట.
దీంతో.. ఆమెకు అసలు విషయం అర్థమైంది. ఆ తర్వాత కెమెరా ముందుకు వెళ్లి, లిప్ లాక్ సీన్లో చక్కగా నటించిందట పూజా. ఆ విధంగా తన తండ్రి పక్కన ఉండి సంజయ్ దత్ కు ముద్దు పెట్టించిన విషయం ఇటీవల వెల్లడించింది పూజా భట్.