
చిత్ర శుక్లా అనే హీరోయిన్ ఉందనే విషయమే చాలామందికి తెలియదు. కానీ ఈ భామకి మిస్ అయిన అవకాశాలను చూస్తే.. మరో రష్మిక మండన్నా అయ్యి ఉండేది, కానీ టైం కలిసి రాక, ప్లాప్ ల పరంపరలో తనకంటూ సినీ అడ్రెస్ కూడా చెప్పుకోలేని దుస్థితిలో ఉంది చిత్ర శుక్లా. నిజానికి చిత్ర శుక్లా ఇప్పటివరకూ తెలుగులో ఐదు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. “మా అబ్బాయి”, “రంగుల రాట్నం”, “సిల్లీ ఫెలోస్”, “తెల్లవారితే గురువారం”.. ఇలా వరుసగా సినిమాలు చేసినా పాపకి హిట్ లేక కనీసం సెకెండ్ హీరోయిన్ ఛాన్స్ కూడా రావడం లేదు.
అయితే చిత్ర శుక్లాకి ఒక గోల్డన్ ఛాన్స్ మిస్ అయింది. గీతగోవిందం సినిమాలో మొదట ఇద్దరు ముగ్గురు హీరోయిన్స్ అనుకున్నారు. వారిలో చిత్ర శుక్లా కూడా ఒకరు. హీరోయిన్ లావణ్య ఆ సినిమాని రిజక్ట్ చేసిన తరువాత, ఆ అవకాశం చిత్ర శుక్లా దగ్గరికే వెళ్ళిందట. అయితే, రెమ్యునరేషన్ ఎక్కువ డిమాండ్ చేయడంతో.. మొత్తానికి ఆ అవకావం రష్మిక దగ్గరకి వెళ్ళింది. ఈ మధ్యలో చిత్ర శుక్లా మరో రెండు సినిమాల్లో హీరోయిన్ గా నటించిన ఆ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఈ క్రమంలో ఈ బ్యూటీకి వచ్చిన అవకాశమే. “తెల్లవారితే గురువారం” సినిమా.
ఈ సినిమా వెనుక రాజమౌళి ఉన్నాడు కాబట్టి.. సినిమా సూపర్ హిట్ అవుతుందని ఆశ పడింది, కానీ తీరా సినిమా రిలీజ్ అయ్యాక పెద్ద డిజాస్టర్ గా నిలిచింది. అసలుకే మోసం వచ్చింది. ఈ సినిమా జరుగుతున్న మధ్యలో సందీప్ కిషన్ సినిమాలో హీరోయిన్ అవకాశం వచ్చిందట. కానీ ఈ సినిమా సూపర్ హిట్ అవుతుంది కాబట్టి, తనకు ఇంకా మంచి అవకాశాలు వస్తాయని కలలు కన్న, ఈ హీరోయిన్, చివరకు ఇప్పుడు సరైన ఛాన్స్ లు లేక, ఛాన్స్ ఇవ్వండి అంటూ సినిమా అఫీస్ ల చుట్టూ తిరుగుతుంది.
ప్రసుతనికి అయితే ఆమె చేతిలో మరో రెండు చిన్న సినిమాలున్నాయి. “ఉనికి” అనే ఒక సినిమాతో పాటు “కాదల్” అనే మరో సినిమా కూడా ఉంది. ఈ సినిమా టైటిల్స్ ను బట్టే తెలుస్తోంది. ఈ సినిమాల రేంజ్ ఏంటో అని. పాపం గీతగోవిందం సినిమా చేసి ఉంటే.. చిత్ర శుక్లా స్టార్ హీరోయిన్ అయి ఉండేది. కానీ ఇప్పుడు ఆమె పేరు కూడా ఎవ్వరికీ తెలియకుండా పోయింది.