మోడీ సార్.. మళ్లీ సామాన్యుడిపై ‘గ్యాస్’ బండ వేసేశాడు..

దేశంలో ఇప్పుడు కరోనా కల్లోలంతో ధరలకు పట్టపగ్గాలు లేకుండా పోతున్నాయి. గ్యాస్ వినియోగదారులకు చమురు సంస్థలు మళ్లీ షాకిచ్చాయి. దీంతో సామాన్యులకు రోజురోజుకు పెరుగుతున్న ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. ఒకవైపు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతుంటే గ్యాస్ ధరలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. గత రెండు నెలల నుంచి గ్యాస్ సిలిండర్ ధరలు అంతకంతకూ పెరుగుతుండగా మరోసారి గ్యాస్ కంపెనీలు ధరలను పెంచి సామాన్యులకు షాక్ ఇచ్చాయి. గత మూడు నెలల వ్యవధిలో గ్యాస్ బండపై […]

Written By: NARESH, Updated On : March 1, 2021 10:37 am
Follow us on

దేశంలో ఇప్పుడు కరోనా కల్లోలంతో ధరలకు పట్టపగ్గాలు లేకుండా పోతున్నాయి. గ్యాస్ వినియోగదారులకు చమురు సంస్థలు మళ్లీ షాకిచ్చాయి. దీంతో సామాన్యులకు రోజురోజుకు పెరుగుతున్న ధరలు చుక్కలు చూపిస్తున్నాయి.

ఒకవైపు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతుంటే గ్యాస్ ధరలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. గత రెండు నెలల నుంచి గ్యాస్ సిలిండర్ ధరలు అంతకంతకూ పెరుగుతుండగా మరోసారి గ్యాస్ కంపెనీలు ధరలను పెంచి సామాన్యులకు షాక్ ఇచ్చాయి.

గత మూడు నెలల వ్యవధిలో గ్యాస్ బండపై రూ.225 పెరిగాయి. గత ఏడాది డిసెంబర్ 1న సిలిండర్ ధర రూ.594 నుంచి రూ.644కి పెంచారు. ఫిబ్రవరి వరకు పెంచుతూ గత 15వ తేదీన రూ.50 పెంచడంతో రూ.769కి పెరిగింది. ఇటీవల ఐదురోజుల్లో తాజా పెంపుతో కలిపి రెండు సార్లు వంట గ్యాస్ పై రూ.25 వడ్డించారు. దీంతో ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో సిలిండర్ ధర రూ.819కి చేరింది.

ఈ నెలలో ఇలా వంట గ్యాస్ ధర పెరగడం మూడవసారి కావడం గమనార్హం. అడ్డూఅదుపు లేకుండా పెరుగుతున్న ధరలు సామాన్యులకు షాక్ ఇస్తున్నాయి. పెరిగిన ధరలతో ఢిల్లీలో గ్యాస్ సిలిండర్ ధర రూ.819కు చేరింది.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్యాస్ సిలిండర్ ధరలపై స్పందించి తగిన చర్యలు తీసుకుంటే మాత్రమే సామాన్యులపై భారం తగ్గే అవకాశం ఉంది. మరోవైపు రోజురోజుకు పెరుగుతున్న పెట్రోల్ ధరలు సైతం సామాన్యులకు భారం కావడం గమనార్హం. భవిష్యత్తులో పెట్రోల్, గ్యాస్ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుండటంతో సామాన్యులు పెట్రోల్, గ్యాస్ పేరు చెబితే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది.

మరోవైపు గ్యాస్ సబ్సిడీ గతంతో పోలిస్తే తక్కువ మొత్తం జమవుతుందని తెలుస్తోంది. సబ్సిడీ తగ్గడం, గ్యాస్ సిలిండర్ ధరలు పెరగడం గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు భారమవుతోంది. పెరుగుతున్న గ్యాస్ ధరలపై కేంద్రం ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.