ప్రతీ శీతాకాలంలో రాష్ట్రపతి హైదరాబాద్ పర్యటన చేయడం ఆనవాయితీగా వస్తోంది. సికింద్రాబాద్లోని బొల్లారంలో రాష్ట్రపతి నిలయం ఉంది. ఇక్కడే రాష్ట్రపతి ప్రతీ శీతాకాలంలో కొన్నిరోజులపాటు బస చేస్తుంటారు. ఈ ఏడాది కూడా రాష్ట్రపతి శీతాకాల విడిది కోసం షెడ్యూల్ కూడా ఖరారైంది.
Also Read: రైతులకు మోదీ సర్కార్ శుభవార్త.. ఖాతాల్లో నగదు జమ ఎప్పుడంటే..?
డిసెంబర్ 16నుంచి 15రోజులపాటు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో భారత ప్రథమ పౌరుడు రామ్ నాథ్ కోవింద్ విడిది చేస్తారని షెడ్యూల్ ఖరారైంది. అయితే రాష్ట్రపతి ఇప్పటివరకు హైదరాబాద్ కు రాలేదు. దీంతో ఆయన పర్యటన వాయిదా పడిందనే టాక్ విన్పిస్తోంది. అయితే దీనిపై రాష్ట్రపతి కార్యాలయం నుంచి ఎలాంటి ప్రకటన విడుదల కాకపోవడం గమనార్హం.
ఇదిలా ఉంటే ఢిల్లీలో కరోనా మహ్మమరి విజృంభించడంతో రాష్ట్రపతి భవన్ కు సందర్శకులను నిలిపివేశారు. అయితే అప్పటికే కొందరు రాష్ట్రపతి భవన్లోని సిబ్బంది కరోనా బారినపడ్డారు. దీంతో రాష్ట్రపతి భవన్లో కరోనా కలకలం మొదలైంది. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సైతం కరోనా టెస్టులు చేయించుకోవాల్సి వచ్చింది. అదృష్టవశాత్తు ఆయన కరోనా పాజిటివ్ రావడంతో అంతా ఊపిరి పిల్చుకున్నారు.
Also Read: అయోధ్యలో రూ.1000 కోట్ల రామాలయం నిర్మాణానికి నిధులు ఎలా వస్తున్నాయి?
ప్రతీయేటా మాదిరిగానే ప్రస్తుత శీతాకాలంలో రాష్ట్రపతి బొల్లారంలో పర్యటిస్తే అధికార.. రాజకీయ ప్రతినిధులతో భేటీలు.. తేనీటి విందు.. సందర్శకులతో మాటామంతీ వంటివన్నీ ఉంటాయి. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో వీటిని నిర్వహించడం రిస్కుతో కూడుకున్న పని. ఈ కారణంగానే రాష్ట్రపతి శీతాకాల విడిది వాయిదా వేసుకున్నట్లు సమాచారం.
కరోనా ముందస్తు జాగ్రత్తల్లో భాగంగానే రాష్ట్రపతి సెక్యూరిటీ విభాగం అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే రాష్ట్రపతి పర్యటన దృష్టిలో ఉంచుకొని అధికారులు ఇప్పటికే బొల్లారంలో అన్ని ఏర్పాట్లు చేశారు. 10కోట్ల రూపాయాలతో రాష్ట్రపతి నిలయానికి అన్ని హంగులు సిద్ధం చేసినట్లు సమాచారం.
మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్