https://oktelugu.com/

ఆర్జీవీని పట్టించుకుంటలేరా..!

సినీ ఇండస్ట్రీలో వివాదాలకు కేరాఫ్‌ ఆర్జీవీ. ఆయనే రామ్‌గోపాల్‌ వర్మ. ఆయన ఏం చేసినా సెన్సేషనలే. ఏం మాట్లాడినా వివాదమే. ఎవరైనా తనపై విమర్శలు చేసినా వెంటనే సమాధానం ఇచ్చే వ్యక్తి. అతి తక్కువ సమయంలోనే సినిమా తీసే డైరెక్టర్‌‌. బూతు.. నీతి.. తేడా ఏదీ లేదంటూ తనకు నచ్చిన సినిమాలు చేసుకుంటూ పోతుంటాడు. Also Read: ఎవరి లెక్కలు వారివి.. అలాంటి రామ్ గోపాల్ వర్మ ‘శివ’ సినిమాతో సినీ ఇండస్ట్రీలో అనేక మార్పులకు కారణమైన […]

Written By:
  • Srinivas
  • , Updated On : December 20, 2020 11:18 am
    Follow us on

    RGV
    సినీ ఇండస్ట్రీలో వివాదాలకు కేరాఫ్‌ ఆర్జీవీ. ఆయనే రామ్‌గోపాల్‌ వర్మ. ఆయన ఏం చేసినా సెన్సేషనలే. ఏం మాట్లాడినా వివాదమే. ఎవరైనా తనపై విమర్శలు చేసినా వెంటనే సమాధానం ఇచ్చే వ్యక్తి. అతి తక్కువ సమయంలోనే సినిమా తీసే డైరెక్టర్‌‌. బూతు.. నీతి.. తేడా ఏదీ లేదంటూ తనకు నచ్చిన సినిమాలు చేసుకుంటూ పోతుంటాడు.

    Also Read: ఎవరి లెక్కలు వారివి..

    అలాంటి రామ్ గోపాల్ వర్మ ‘శివ’ సినిమాతో సినీ ఇండస్ట్రీలో అనేక మార్పులకు కారణమైన సంగతి తెలిసిందే. అప్పటి వరకూ మూసధోరణిలో వెళ్తున్న సినిమాకి కొత్త దారి చూపించాడు. డిఫరెంట్ స్క్రీన్ ప్లే తో.. అసాధారణమైన కెమెరా యాంగిల్స్ తో.. కొత్త సౌండింగ్‌తో చరిత్ర నిలిచిపోయే సినిమా రూపొందించాడు. ఆ తర్వాత తెలుగులో ‘గాయం’ ‘క్షణక్షణం’ ‘అంతం’ ‘రాత్రి’ ‘గోవిందా గోవిందా’.. హిందీలో ‘సత్య’ ‘కంపెనీ’ ‘రంగీలా’ ‘భూత్’ ‘సర్కార్’ ‘సర్కార్ రాజ్’ వంటి సినిమాలు తీశాడు. అయితే వర్మ ఉన్నట్టుండి క్రియేటివ్ సినిమాలు తీయడం మానేసి ‘ఐస్ క్రీమ్’ ‘అనుక్షణం’ ‘ఆఫీసర్’ ‘నగ్నం’ ‘క్లైమాక్స్’ వంటి నాసిరకం సినిమాలు చూపించాడు.

    ఇండస్ట్రీకి కొత్తదారి చూపించిన ఆర్జీవీ.. ఇప్పుడు బూతు సినిమాలు.. ఎవరినో టార్గెట్ చేస్తూ ఫిక్షనల్ రియాలిటీ సినిమాలు.. యధార్థ సంఘటనల ఆధారంగా సినిమాలు చేస్తున్నాడు. అయితే ఒకప్పటిలా రామ్ గోపాల్ వర్మను ఎవరూ పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. కరోనా లాక్ డౌన్ నేపథ్యాన్ని తీసుకొని తీసిన ‘కరోనా వైరస్’ సినిమాని జనాలు పెద్దగా పట్టించుకోలేదు.

    Also Read: చిన్న సినిమాకు పెద్ద గౌరవం

    వాస్తవ సంఘటనల ఆధారంగా ‘మర్డర్’ అనే కుటుంబ కథా చిత్రమ్ తీసి రిలీజ్‌కు రెడీ చేసినా ఎవరూ లెక్క చేయడం లేదు. ఇక ఇప్పుడు ఆర్జీవీని ఇన్ స్పైర్ చేసే ఇన్సిడెంట్లు బయట ఏమీ జరగలేదు. మహా అయితే ఆర్జీవీ ఇప్పుడు ట్రిపుల్ ఆర్ మీదనో లేదా తెలంగాణలో బీజేపీ హవా మీదనో సినిమాలు తీయాలి తప్పితే ప్రస్తుతానికి వర్మ దగ్గర కాన్సెప్ట్స్ అయితే లేవని కామెంట్స్ వినిపిస్తున్నాయి.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్