https://oktelugu.com/

‘రాధేశ్యామ్’ నుంచి ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్ ఇదే

ఈరోజు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు. దీంతో ఆయన అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. ఈ వేడుకలకు మరింత ఉత్సాహం అందించేలా తాజాగా డార్లింగ్ అభిమానులకు బర్త్ డే గిఫ్ట్ వచ్చేసింది. ఇది చాలా సర్ ప్రైజ్ గా ఉంది. Also Read: జక్కన్నపై కాపీ మరక.. ఇలా బుక్కయ్యడెంటీ? ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న ‘రాధేశ్యామ్’ టీం నుంచి ఫస్ట్ లుక్ ల పరంపర కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా స్పెషల్ సర్ […]

Written By:
  • NARESH
  • , Updated On : October 23, 2020 / 12:32 PM IST
    Follow us on

    ఈరోజు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు. దీంతో ఆయన అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. ఈ వేడుకలకు మరింత ఉత్సాహం అందించేలా తాజాగా డార్లింగ్ అభిమానులకు బర్త్ డే గిఫ్ట్ వచ్చేసింది. ఇది చాలా సర్ ప్రైజ్ గా ఉంది.

    Also Read: జక్కన్నపై కాపీ మరక.. ఇలా బుక్కయ్యడెంటీ?

    ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న ‘రాధేశ్యామ్’ టీం నుంచి ఫస్ట్ లుక్ ల పరంపర కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా స్పెషల్ సర్ ప్రైజ్ ను రాధేశ్యామ్ టీం విడుదల చేసింది.

    ప్రభాస్ పుట్టిన రోజును పురస్కరించుకొని తాజాగా చిత్రబృందం తొలి మోషన్ పోస్టర్ ను విడుదల చేసింది. ‘బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్’ పేరుతో విడుదలైన ఈ పోస్ట్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

    వింటేజ్ ప్రేమకథా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీ ఒక కొండపైన రైల్లో ప్రయాణిస్తున్న ప్రభాస్-పూజాహెగ్డేలో కిటీకి నుంచి వేలడాడుతూ ఇచ్చిన ఈ పోజ్ కేక పుట్టిస్తోంది. దిల్ వాలే దుల్హానియా లేజాయింగే సినిమాలోని షారుఖ్-కాజల్ ప్రేమకథను మించి ఈ లుక్ అభిమానులను పిచ్చేక్కిస్తోంది.

    Also Read: ‘ఆరెంజ్’ దెబ్బకు అన్నయ్య నాగబాబు ఆస్తులు అమ్ముకున్నాడు.. పవన్ భావోద్వేగం

    రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. జస్టిస్ ప్రభాకరణ్ ఈ చిత్రానికి స్వరాలు అందిస్తున్నారు. ప్రస్తుతం ఇటలీలో ఈ సినిమా షూటింగ్ సాగుతోంది.