సినీ సెలబ్రెటీలు రాజకీయాల్లోకి రావడం కొత్తమే కాదు. ఇలా వచ్చిన వాళ్లల్లో కొందరు ముఖ్యమంత్రులు.. కేంద్ర మంత్రులు.. ఎమ్మెల్యేలు.. ఎంపీలై చక్రం తిప్పినవాళ్లు ఉన్నారు. మరికొందరికీ అదృష్టం కలిసి రాకపోవడంతో వారంతా మళ్లీ సినిమాలనే నమ్ముకున్నారు. ఇదిలా ఉంటే సూపర్ స్టార్ రజనీ కాంత్ మాత్రం పొలిటిలకల్ ఎంట్రీపై ఏ విషయం తేల్చకుండా కొన్నేళ్లుగా నాన్చుతుండటం విమర్శలకు తావిస్తోంది.
Also Read: ‘ఏమనాలి వీణ్ణి..’ సీఎం జగన్ పై చంద్రబాబు దారుణ వ్యాఖ్యలు
నాన్న.. పులి కథ మాదిరిగా రజనీకాంత్ పొలికల్ ఎంట్రీ ఉంది. తమిళనాడులో ఎన్నికలు వస్తున్న ప్రతీసారి రజినీకాంత్ పొలికల్ ఎంట్రీపై వార్తలు రావడం కామన్ అయిపోయింది. దీనిపై రజనీ ప్రతీసారి దాటవేసే ధోరణిని అవలంభిస్తున్నాడు. దేవుడి శాసిస్తే.. రాజకీయాల్లోకి వస్తానంటూ పరోక్షంగా రాజకీయాలపై ఆసక్తిని కనబరుస్తున్నాడు.
దివంగత తమిళనాడు సీఎం జయలలితతో రజనీకాంత్ కు పడని కారణంగా అప్పట్లో ఆయన రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారం జరిగింది. ఇక ఆమె మరణంతో తమిళనాడులో రాజకీయ శున్యాత ఏర్పడిందని రజనీ అభిమానులు భావిస్తున్నారు. ఈ కారణంగానే ఆయనను రాజకీయాల్లోకి రావాలని అభిమానులు కోరుతున్నాయి.
Also Read: కాంగ్రెస్ కార్యకర్తలకు గుడ్ న్యూస్
రజనీ సైతం అభిమానులతో వరుస సమావేశాలు పెడుతూ వారి నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నారు. అయితే ప్రతీసారి రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీపై స్పష్టమైన ప్రకటన చేయకపోవడంతో అభిమానులు నిరాశ చెందుతున్నారు. తాజాగా చెన్నైలో జరిగిన అభిమానుల సమావేశంలో రజనీకాంత్ ఎలాంటి రాజకీయ ప్రకటన చేయలేదు. మరో రెండ్రోజుల్లో రాజకీయ ఎంట్రీపై క్లారిటీ ఇస్తానంటూ దాటవేశారు.
ప్రతీసారి రాజకీయ ఎంట్రీపై రజనీ సస్పెన్స్ లో పెడుతుండటంపై అభిమాన సంఘాలు సైతం మండిపడుతున్నట్లు తెలుస్తోంది. రజనీ కంటే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఎంతో నయమంటూ కామెంట్స్ చేస్తున్నారు. పవన్ కల్యాణ్ రాజకీయాల్లోని రావాలనుకున్న వెంటనే పార్టీని ప్రకటించేశాడు. ఆ తర్వాత ఎన్నికల్లో ఓటమిపాలైన ఆ పార్టీని కొనసాగిస్తూ ప్రజా సమస్యలపై పోరాడుతున్నాడు. ఈ లెక్కన చూస్తే సూపర్ స్టార్ రజనీ కంటే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వందపాళ్లు నయమంటూ కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్