పిల్లలు ఎత్తు పెరగడం కోసం పాటించాల్సిన చిట్కాలివే..?

సాధారణంగా మనుషుల యొక్క జీన్స్ ను బట్టి పిల్లల్లో ఎదుగుదల వస్తుంది. తల్లిదండ్రులు ఎత్తుగా ఉంటే పిల్లలు కూడా ఎత్తుగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎత్తు పెరగడం కొందరు పిల్లల్లో 18 సంవత్సరాలకే ముగిస్తే మరి కొందరిలో మాత్రం 21 సంవత్సరాలకు ముగుస్తుంది. ప్రస్తుత కాలంలో ఆహారపు అలవాట్లు, జీవనశైలి వల్ల కొందరు అమ్మాయిలు, అబ్బాయిల్లో పెరుగుదల తక్కువగా ఉంటోంది. Also Read: పోస్టాఫీస్ సూపర్ స్కీమ్.. రూ.10 వేలు కడితే 16 లక్షలు..! సరైన […]

Written By: Navya, Updated On : November 23, 2020 11:38 am
Follow us on


సాధారణంగా మనుషుల యొక్క జీన్స్ ను బట్టి పిల్లల్లో ఎదుగుదల వస్తుంది. తల్లిదండ్రులు ఎత్తుగా ఉంటే పిల్లలు కూడా ఎత్తుగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎత్తు పెరగడం కొందరు పిల్లల్లో 18 సంవత్సరాలకే ముగిస్తే మరి కొందరిలో మాత్రం 21 సంవత్సరాలకు ముగుస్తుంది. ప్రస్తుత కాలంలో ఆహారపు అలవాట్లు, జీవనశైలి వల్ల కొందరు అమ్మాయిలు, అబ్బాయిల్లో పెరుగుదల తక్కువగా ఉంటోంది.

Also Read: పోస్టాఫీస్ సూపర్ స్కీమ్.. రూ.10 వేలు కడితే 16 లక్షలు..!

సరైన పోషకాహారం తీసుకుంటే మనం తీసుకునే పోషకాహారం ఎత్తు ఎదగడానికి సహాయపడుతుంది. ఎత్తు పెరగాలంటే ప్రతిరోజూ మనం తీసుకునే ఆహారంలో తాజా కూరగాయలు, పండ్లు, కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు ఉండే విధంగా జాగ్రత్త పడాలి. రోజూ ఉసిరికాయను తీసుకోవడం వల్ల కూడా సులభంగా ఎత్తు పెరిగే అవకాశాలు ఉంటాయి. ఉసిరిలో ఉండే విటమిన్లు, మినరల్స్ ఎత్తు పెరగడంలో సహాయపడతాయి.

పెరుగు, చేపలు, చికెన్, వెన్న తరచూ తీసుకుంటే వాటిలో ఉండే ప్రోటీన్లు కండరాలను, శరీర బరువును పెంచడంలో సహాయపడతాయి. గుడ్లను ఇష్టపడేవాళ్లు ప్రతిరోజూ ఒక గుడ్డును తీసుకుంటే మంచిది. పాలలో బెల్లం, మిరియాలు, అశ్వగంధ పొడి కలిపి ప్రతిరోజూ తీసుకున్నా మంచి ఫలితాలు ఉంటాయి. ప్రతిరోజూ కనీసం అరగంట సమయం వ్యాయామం చేయాలి. సైకిల్ తొక్కటం, స్కిప్పింగ్ ఆడటం వల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయి.

Also Read: బ్యాంక్ కు వెళ్లకుండానే అకౌంట్ తెరిచే ఛాన్స్.. ఎలా అంటే..?

అయితే ఎదిగే వయసులో కఠినమైన వ్యాయామాలు చేయకూడదు. కఠినమైన వ్యాయామాలు చేస్తే గ్రోత్ ప్లేట్స్ దెబ్బ తినే అవకాశాలు ఉంటాయి. తక్కువ బరువులతో వ్యాయామాలు చేయడం, స్ట్రెచింగ్‌ వ్యాయామాలు చేయడం ఆటలు ఎక్కువగా ఆడటం వల్ల ఎత్తు పెరగవచ్చు. చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ రోజుకు 8 గంటలు నిద్రపోవడం ద్వారా కూడా ఎత్తు ఎదిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.