https://oktelugu.com/

మాట వినని నిమ్మగడ్డ.. రంగంలోకి పోలీసులు?

రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు ఏపీ ప్రభుత్వం ససేమిరా అంటోంది. అయినా ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ మాత్రం ఎలాగైనా నిర్వహించి తీరుతామనే పట్టుదలతో ముందుకు సాగుతున్నాడు. సుప్రీంకోర్టులో కేసు ఉన్నందున ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయవద్దని వైసీపీ నాయకులు సూచిస్తున్నా ఆయన విలనలేదు. ఇవేమీ తనకు పట్టవంటూ.. రమేశ్ కుమార్ శనివారం స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేశారు. అయితే ఏపీ ప్రభుత్వం పలు ఉద్యోగ సంఘాలు.. ఉపాధ్యాయ సంఘాలు చెప్పినా రమేశ్ కుమార్ […]

Written By:
  • NARESH
  • , Updated On : January 24, 2021 / 10:53 AM IST
    Follow us on

    రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు ఏపీ ప్రభుత్వం ససేమిరా అంటోంది. అయినా ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ మాత్రం ఎలాగైనా నిర్వహించి తీరుతామనే పట్టుదలతో ముందుకు సాగుతున్నాడు. సుప్రీంకోర్టులో కేసు ఉన్నందున ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయవద్దని వైసీపీ నాయకులు సూచిస్తున్నా ఆయన విలనలేదు. ఇవేమీ తనకు పట్టవంటూ.. రమేశ్ కుమార్ శనివారం స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేశారు. అయితే ఏపీ ప్రభుత్వం పలు ఉద్యోగ సంఘాలు.. ఉపాధ్యాయ సంఘాలు చెప్పినా రమేశ్ కుమార్ మాట వినకపోవడంతో చివరికి పోలీసుశాఖ వారు రంగంలోకి దిగారు.

    Also Read: నిమ్మగడ్డ యాక్షన్ వెనుకున్నది ఆయనేనా?

    స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పునరాలోచించుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. ఓ వైపు కరోనా కేసులు ఇంకా తగ్గలేదని.. తమ ప్రాణాలు ఫణంగా పెట్టి విధులు నిర్వహించలేమని అంటున్నారు. ఇప్పటికే ఏపీ ఉద్యోగుల సంఘం నేతలు నిమ్మగడ్డపై సహాయ నిరాకరణకు సిద్ధమవ్వగా.. శనివారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సమావేశానికి ఏపీ ఉన్నతాధికారుల్లో ఒక్కరు కూడా హాజరు కాలేదు.

    ఈ క్రమంలో రంగంలోకి దిగిన పోలీసు ఉన్నతాధికారుల సంఘం నాయకులు.. ఏపీ ఉద్యోగులతోపాటు తాముకూడా .. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ప్రభుత్వ సూచనల మేరకే నడుచుకుంటామని చెబుతున్నారు. కరోనా వైరస్ ఉధృతి రాష్ట్రంలో ప్రారంభం అయినప్పటి నుంచి తన డిపార్టుమెంటులో 109మంది పోలీసులు బలయ్యారని వైరస్ ప్రభావం తగ్గక ముందే ఎన్నికలకు వెళ్లడం సరైన నిర్ణయం కాదని రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు జనుకుల శ్రీనివాస్ నిమ్మగడ్డకు విన్నవించారు.

    పోలీసుశాఖలో ఇప్పటి వరకు 109మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారని.. మరో 14 వేల మంది పోలీసులు కరోనా బారిన పడిన విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పడు ఎన్నికలు నిర్వహిస్తే.. పరిస్థితి చేయి దాటిపోతుందని.. ఈ క్రమంలో తాము రిస్క్ తీసుకోలేమని.. ఎన్నికలకు తాము సహకరించమని తేల్చి చెప్పేశారు.

    Also Read: ‘రిజర్వేషన్లు’.. బీసీల నోట్లో మట్టియేనా?

    పోలీసుశాఖలో ముందుగా వ్యాక్సినేషన్ ప్రక్రియ జరగాలన్న శ్రీనివాస్.. ప్రస్తుతం వ్యాక్సినేషన్ తొలి విడత ప్రక్రియ కొనసాగుతున్నందున తాము బందోబస్తు చేయాలంటే.. ఇబ్బంది ఉంటుందని తెలిపారు. ఎన్నికల ద్వారా మరింత వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని.. దీనిని పరిగణలోకి తీసుకోవాలని ఎస్ఈసీకి సూచించారు. ఎన్నికలు అవసరమే కానీ.. కొంతకాలం వాయిదా వేస్తే.. బాగుంటుందని సూచించారు.

    ఇటు పోలీసులు సైతం తమ అభిప్రాయాన్ని నిమ్మగడ్డకు చెబుతున్నారు. ఎస్ఈసీకి చేతులెత్తి మొక్కుతాం.. ఇప్పటికే చాలా మంది పోలీసులు కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు.. ప్రజలకు సేవ చేసే తమ ప్రాణాలతో ఆడుకోవద్దని కోరుతున్నారు. వ్యాక్సినేషన్ మొత్తం పూర్తయ్యాక ఎన్నికలు నిర్వహించాలని సూచిస్తున్నారు.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్