అత్యంత ప్రజాదరణమండిపోతున్న పెట్రోల్‌..: సెంచరీకి చేరువలో..

మండిపోతున్న పెట్రోల్‌..: సెంచరీకి చేరువలో..

Petrol
రానురాను ఇంటి నుంచి బైక్‌ బయటికి తీయాలంటే ఆలోచించాల్సిన పరిస్థితులే వస్తున్నాయి. ఎందుకంటే.. రోజురోజుకూ మండిపోతున్న పెట్రోల్‌ ధరలు వాహనదారులను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. లీటరు పెట్రోల్‌ ధర రూ.90 దాటి సెంచరీ దిశగా పరుగులు పెడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో 100 మార్కును కూడా దాటేశాయి. ఎప్పుడూ లేని విధంగా పెట్రోల్ ధరలు తొలిసారి వంద మార్క్ దాటి ఆల్ రికార్డ్ సృష్టించాయి. ఇటీవల ఆయిల్ కంపెనీలు ధరల మోత మోగిస్తున్న నేపథ్యంలో ఇంధన ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.

Also Read: ఏపీలోనే పెట్రోల్‌ ధరలు అధికం.. : ఎందుకో తెలుసా

మనదేశంలో రాజస్థాన్‌లోనే పెట్రోల్ ధరలు ఎక్కువగా ఉన్నాయి. శ్రీగంగనార్ పట్టణంలో ప్రీమియం పెట్రోల్ ధర రూ.100 మార్కును దాటింది. సాధారణ పెట్రోల్ ధర రూ.98.40కి చేరింది. ప్రీమియం అంటే అత్యంత నాణ్యమైన పెట్రోల్ అని అర్థం. ప్రీమియం పెట్రోల్ ధర ఢిల్లీలో రూ.89.10గా ఉండగా.. ముంబైలో రూ.95.61గా ఉంది. ప్రీమియం పెట్రోల్, సాధారణ పెట్రోల్ మధ్య ప్రధానమైన తేడా ఆక్టేన్ నెంబర్. సాధారణ పెట్రోల్‌కు ఆక్టేన్ నెంబర్ తక్కువగా ఉంటే, ప్రీమియం పెట్రోల్‌కు ఎక్కువగా ఉంటుంది. ప్రీమియం పెట్రోల్ ఆక్టేన్ నెంబర్ 91గా ఉంటుంది. ఇంధన యొక్క మండే నాణ్యత కొలతను ఆక్టేన్ నెంబర్‌గా పేర్కొంటారు.

Also Read: ప్రజలకు అలర్ట్.. ఫిబ్రవరిలో అమలులోకి వచ్చే కొత్త నిబంధనలివే.

హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.89.77గా ఉంది. ఇక డీజిల్ ధర రూ. 83.46గా ఉంది. విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర 92.51 ఉంటే, డీజిల్ ధర రూ.85.70 పలుకుతోంది. విశాఖలో లీటర్ పెట్రోల్ ధర రూ.91.91గా ఉంటే.. డీజిల్ ధర రూ.85.09గా ఉంది. మరోవైపు డీజిల్ ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి. ఢిల్లీలో లీటర్ డీజిల్ ధర రూ.76.23గా ఉంది. ముంబైలో ఇప్పటికే రూ.83 దాటింది. ఇక రాజస్థాన్‌లోని శ్రీగంగనార్ పట్టణంలో దాదాపు 90కి చేరింది.

మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం

రానున్న రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు మరింతగా పెరిగే అవకాశముంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వాల తీరుపై సామాన్య ప్రజలు మండిపడుతున్నారు. పెరుగుతున్న ఇంధన ధరలకు కళ్లెం వేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Related News

Israel Iran War Highlights: ఇరాన్‌–ఇజ్రాయెల్‌ యుద్ధ భయం.. భారత్‌ను కాపాడుతున్న రాతి గుహల వ్యూహం

Israel Iran War Highlights: ఇరాన్‌–ఇజ్రాయెల్‌ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు, హార్మూజ్‌ జలసంధి మూసివేత భయంతో ప్రపంచ దేశాలు క్రూడ్‌ ఆయిల్‌ సంక్షోభం గురించి ఆందోళన చెందుతున్నాయి.

Tata Tiago :పెట్రోల్‌కు గుడ్‌బై చెప్పేయండి.. ఈ ఎలక్ట్రిక్ కారుపై రూ.1.3 లక్షల డిస్కౌంట్!

Tata Tiago : తక్కువ ధర, అద్భుతమైన ఫీచర్లు, లో మెయింటెనెన్స్ ఖర్చు కారణంగా భారత మార్కెట్లో టియాగో ఈవీ అత్యంత పాపులారిటీ పొందిన ఎంట్రీ లెవెల్ ఎలక్ట్రిక్ కారుగా నిలిచింది.

Most Popular

Delhi Protests: అటు కాక్రోచ్ లు.. ఇటు రైతులు.. మోడీకి ఏంటీ తలనొప్పులు

Delhi Protests: ఢిల్లీ నగరం ఆందోళనలతో అట్టుడికి పోతుంది. గతంలో కేంద్రం వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చింది. అప్పుడు హర్యానా, పంజాబ్ రాష్ట్రాలకు సంబంధించిన కొంతమంది రైతులు అందులో పాల్గొన్నారు. ఇదే అదునుగా ఖలీస్థానీ...

Skyroot Aerospace: స్కై రూట్ మాత్రమే కాదు.. ఇంకా చాలా ఉన్నాయి.. భవిష్యత్తు మొత్తం వీటిదే..

Skyroot Aerospace: స్కై రూట్ అంతరిక్ష పరిశోధన లో సరికొత్త చరిత్రను ఆవిష్కరించింది. తక్కువ, మధ్య స్థాయి బరువున్న ఉపగ్రహాలను ప్రత్యేకమైన రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి పంపించి అద్భుతం సృష్టించింది. ప్రైవేట్ రంగంలో...

Thammineni Sitaram: తమ్మినేని సీతారాంను కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది..

Thammineni Sitaram: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు శాసనసభ స్పీకర్ గా తమ్మినేని సీతారాం కొనసాగారు. ఈయన ఇప్పుడు ఏపీ రాజకీయాలలో ప్రధానంగా కనిపిస్తున్నారు. ఈయన పేరు...

Argentina Vs Spain: బలమైన అర్జెంటీనా.. ఓడిపోయింది అందుకే..

Argentina Vs Spain: ఫిఫా వరల్డ్ కప్ లో సంచలనం నమోదయింది. హోరాహోరీగా సాగిన ఫైనల్ మ్యాచ్లో స్పెయిన్ విజయం సాధించింది. రెండు జట్లలో కొదమసింహాల లాంటి ప్లేయర్లు ఉన్న నేపథ్యంలో.....

AP Investment Ranking: దేశంలోనే ఏపీ 8వ స్థానం.. తెలంగాణకు ఎంతకు దిగజారిందంటే?

AP Investment Ranking: నీతి ఆయోగ్‌ ఇటీవల విడుదల చేసిన ఇన్వెస్ట్‌మెంట్‌ ఫ్రెండ్లీ ఇండెక్స్‌ (ఐఎఫ్‌ఐ) రాష్ట్రాల పెట్టుబడి వాతావరణాన్ని మరింత విస్తృతంగా అంచనా వేసే కొత్త సాధనం. గతంలో కేంద్రం నిర్వహించిన...
Exit mobile version