https://oktelugu.com/

మహేష్ కథతో పవన్.. పూరి డైరెక్టర్

ఒకప్పుడు స్టన్నింగ్ కథలో టాలీవుడ్ ను షేక్ చేసిన డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఇప్పుడు హిట్స్ తగ్గి కాస్త వెనక్కి తగ్గాడు. ఇటీవలే ఇస్మార్ట్ శంకర్ మూవీతో హిట్ కొట్టి మరోసారి ఫామ్ లోకి వచ్చాడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో కలిసి ‘లైగర్’ మూవీని తీస్తున్నాడు. ముంబైలోనే దీన్ని మొత్తం షూట్ చేస్తున్నాడు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాతో విజయ్ దేవరకొండను బాలీవుడ్ లోకి పూరి దింపుతున్నాడు. కరణ్ జోహర్ ఈ సినిమాను హిందీలో […]

Written By:
  • NARESH
  • , Updated On : February 2, 2021 / 08:55 PM IST
    Follow us on

    ఒకప్పుడు స్టన్నింగ్ కథలో టాలీవుడ్ ను షేక్ చేసిన డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఇప్పుడు హిట్స్ తగ్గి కాస్త వెనక్కి తగ్గాడు. ఇటీవలే ఇస్మార్ట్ శంకర్ మూవీతో హిట్ కొట్టి మరోసారి ఫామ్ లోకి వచ్చాడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో కలిసి ‘లైగర్’ మూవీని తీస్తున్నాడు.

    ముంబైలోనే దీన్ని మొత్తం షూట్ చేస్తున్నాడు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాతో విజయ్ దేవరకొండను బాలీవుడ్ లోకి పూరి దింపుతున్నాడు. కరణ్ జోహర్ ఈ సినిమాను హిందీలో నిర్మిస్తున్నాడు.

    ఈ క్రమంలోనే ముంబై నుంచి హైదరాబాద్ వచ్చినప్పుడల్లా పవర్ స్టార్ పవన్ ను పూరి జగన్నాథ్ కలుస్తున్నట్టు సమాచారం. ఇద్దరూ కలిసి మహేష్ బాబుతో పూరి తీయాలనుకున్న ‘జనగణమన’ మూవీ కథపై సిట్టింగులు వేస్తున్నారట.. ఈ కథను ఎలాగైనా తీయాలని చూస్తున్న పూరి జగన్ కు పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని.. ఈ కథను సినిమాగా తీయడానికి ఇద్దరూ కసరత్తు చేస్తున్నట్టు తెలిసింది.

    2024 ఎన్నికలకు ముందు మంచి సందేశాత్మక కథతో సినిమా తీసి ప్రజల్లోకి వెళ్లాలని పవన్ భావిస్తున్నాడు. అలాంటి కథను తీర్చిదిద్దాలని పూరికి సూచిస్తున్నాడట.. ఇప్పటికే వీరిద్దరూ తీసిన ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ మూవీ అప్పట్లో రాజకీయంగా షేక్ చేసింది. ఈ క్రమంలోనే ఏపీ రాజకీయాలే టార్గెట్ గా వీరిద్దరూ చర్చలు జరుపుతున్నట్టు టాక్.