https://oktelugu.com/

వాయిదా కోరిన వకీల్ సాబ్

రాజకీయాలకు కాస్తంత విరామం ఇచ్చి పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్నాడు. కానీ ఊహించని ఉపద్రవంలా కరోనా వచ్చి సినిమాలకు పెద్ద అడ్డంకి అయ్యింది. అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ నటిస్తున్న `వకీల్ సాబ్ ` సినిమా షూటింగ్ కూడా నిలిపి వేయడం జరిగింది. అలా ముందు వేసుకొన్న షూటింగ్ షెడ్యూల్ ఆగిపోవడంతో లాక్ డౌన్ ముగిసిన వెంటనే క్రిష్ డైరెక్ట్ చేస్తున్న రెండో సినిమాని ఆపేసి `వకీల్ సాబ్`చిత్రాన్ని ముందు పూర్తి చేయాలని […]

Written By:
  • admin
  • , Updated On : April 3, 2020 / 10:17 AM IST
    Follow us on


    రాజకీయాలకు కాస్తంత విరామం ఇచ్చి పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్నాడు. కానీ ఊహించని ఉపద్రవంలా కరోనా వచ్చి సినిమాలకు పెద్ద అడ్డంకి అయ్యింది. అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ నటిస్తున్న `వకీల్ సాబ్ ` సినిమా షూటింగ్ కూడా నిలిపి వేయడం జరిగింది. అలా ముందు వేసుకొన్న షూటింగ్ షెడ్యూల్ ఆగిపోవడంతో లాక్ డౌన్ ముగిసిన వెంటనే క్రిష్ డైరెక్ట్ చేస్తున్న రెండో సినిమాని ఆపేసి `వకీల్ సాబ్`చిత్రాన్ని ముందు పూర్తి చేయాలని పవన్ కళ్యాణ్ డిసైడ్ అయ్యాడట.ప్రముఖ నిర్మాత దిల్ రాజు తీస్తున్న ఈ సినిమా ఇప్పటికే 70 శాతం పైగా షూటింగ్ పూర్తి చేసుకొంది. ఈ క్రమంలో వకీల్ సాబ్ చిత్రం ముందు పూర్తి అయితే నిర్మాతకు కొంత నష్ట నివారణ జరుగుతుందని పవన్ ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

    పవన్ కళ్యాణ్ నటిస్తున్న రెండో సినిమా ఒక పీరియాడిక్ మూవీ. గౌతమీపుత్ర శాతకర్ణి ఫేమ్ క్రిష్ తీస్తున్న ఈ జానపద చిత్రానికి ఎక్కువ టైం పడుతుంది ముందు వకీల్ సాబ్ చిత్రం పూర్తి చేయాలని పవన్ ఫిక్స్ అయ్యాడట … దాంతో డైరెక్టర్ క్రిష్ కి ఈ విషయం చెప్పి, ఈలోగా వేరే పనులుంటే చేసుకోమని అనడంతో క్రిష్ ఒక వెబ్ సిరీస్ తీసే పనిలో పడ్డాడట. పవన్ కళ్యాణ్ కి ఎలాగో రెండు, మూడు నెలల సమయం పడుతుంది కనుక ఈలోగా స్క్రిప్ట్ తో పాటు వెబ్ మూవీ షూటింగ్ కూడా పూర్తి చేసేసు కోవచ్చునని క్రిష్ భావిస్తున్నాడట. ఇదిలావుంటే పవన్ కళ్యాణ్ తో క్రిష్ తీస్తున్న జానపద చిత్రంలో కథానాయికగా నటించడానికి బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ఓకే చెప్పిందట. జాక్వెలిన్ ఇంతకుముందు తెలుగులో ప్రభాస్ హీరోగా నటించిన సాహో చిత్రంలో ` బాడ్ బాయ్ `సాంగ్ లో నర్తించింది . ఇపుడు పూర్తి స్థాయి హీరోయిన్ గా పవన్ కళ్యాణ్ చిత్రం తో మనముందుకు వస్తోంది కాగా ఆమె డేట్స్ ఆగష్టు నుంచి అవసరం అవుతాయని లాక్ చేశారట …