https://oktelugu.com/

కరోనా పేరుతొ కుట్ర జరిగిందా !

ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తి వెనుక ఏదైనా కుట్ర దాగి ఉందా ? కరోనావైరస్ పేరుతో చైనా ప్రపంచాన్ని మోసం చేసిందా? ఇలాంటి ఎన్నో అనుమానాలు ఇప్పుడు తెరమీదకి వస్తున్నాయి. అందుకు కారణం లేకపోలేదు. అమెరికా, యూరప్ కి చెందిన బిజినెస్ మాగ్నెట్స్ చైనాలోని లీడింగ్ కంపెనీలలో తమకున్న విలువైన షేర్లను అతి తక్కువ ధరలకే చైనా ప్రభుత్వానికే అమ్ముకోవాల్సి రావడంపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చైనాలో బలంగా స్థిరపడిన యూరప్, అమెరికాకు చెందిన […]

Written By:
  • admin
  • , Updated On : March 26, 2020 / 10:44 AM IST
    Follow us on

    ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తి వెనుక ఏదైనా కుట్ర దాగి ఉందా ? కరోనావైరస్ పేరుతో చైనా ప్రపంచాన్ని మోసం చేసిందా? ఇలాంటి ఎన్నో అనుమానాలు ఇప్పుడు తెరమీదకి వస్తున్నాయి.

    అందుకు కారణం లేకపోలేదు. అమెరికా, యూరప్ కి చెందిన బిజినెస్ మాగ్నెట్స్ చైనాలోని లీడింగ్ కంపెనీలలో తమకున్న విలువైన షేర్లను అతి తక్కువ ధరలకే చైనా ప్రభుత్వానికే అమ్ముకోవాల్సి రావడంపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

    చైనాలో బలంగా స్థిరపడిన యూరప్, అమెరికాకు చెందిన పెట్టుబడిదారులను సాగనంపే దారిలో చైనా ఈ కుట్ర పన్నినట్టుగా అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఇంతకు ముందు చైనాలో పేరొందిన రసాయన, సాంకేతిక పరిశ్రమలలో యూరప్, అమెరికాకు చెందిన వ్యాపార సంస్థల పెట్టుబడులే అధికం. అందులో సగం లాభాలను ఆ రెండు అగ్ర దేశాల వారే పంచు కోవడం చైనాకు కంటగింపు గా మారింది. అదీగాక చైనా కరెన్సీ యాన్ అగ్ర రాజ్యాల డాలర్ వల్ల నిత్యం ఒడిదొడుకులను ఎదుర్కొంటోందన్న నమ్మకం చైనా వారిలో బలంగా ఉంది. దరిమిలా చైనా కరోనాను అస్త్రంగా వాడుకున్నట్టుగా యూరప్ దేశాలు చెందిన విశ్లేషకులు భావిస్తున్నారు.

    ఆ క్రమం లో చైనా మొత్తం కాకుండా వ్యుహాన్ నగరం వరకే కరోనా వైరస్ పరిమితమయ్యేలా ఆ దేశం చూసుకొంది. కరోనా వైరస్ ని ఎదుర్కొనేందుకు తమ ఆర్ధిక వ్యవస్థ సిద్ధం గా లేదని ,ఇంకా చెప్పలాంటే కనీసం ముఖానికి తొడుక్కొనే మాస్కులు కొనే ఆర్థిక పరిస్థితులు కూడా తమకు లేవని బుకాయించింది. కరోనా వైరస్ ప్రమాదం ఫై చైనా అధ్యక్షుడు జిన్ సింగ్ చేసిన వ్యాఖ్యలు చైనా పారిశ్రామిక రంగంపై విపరీత ప్రభావం చూపింది. దాంతో అగ్ర రాజ్యాల పెట్టుబడిదారులు తమ వాటాలను లాభాలకు అతీతంగా అమ్ముకున్నారు. కాగా మొత్తం ఈ కుట్ర వ్యవహారం లో ఉన్న నిజానిజాలు త్వరలోనే మనకు వెల్లడి కానున్నాయి. అని తెలుస్తోంది ,.

    చైనాలో అమెరికా , యూరప్ దేశాల పెట్టుబడి దారులు అమ్మిన వాటాల విలువ 20 బిలియన్ డాలర్ల పైగానే ఉంది .ఇదంతా కేవలం రెండే రెండు రోజుల్లో జరిగిపోయింది. మొత్తం ఈ వ్యవహారం లో ఏ మాత్రం అనుమానం రాకుండా చైనా చాలా పకడ్బందీగా వ్యవహరించింది. దీనిని అర్ధం చేసుకునే సరికి అమెరికా, యూరప్ పెట్టుబడిదారుల షేర్లన్నీ చైనా ప్రభుత్వం చేతిలోకి వెళ్లిపోయాయి.

    ఇవన్నీ ఒక ఎత్తయితే కరోనా వైరస్ వల్ల చైనా తీవ్ర ఇబ్బందులు పడ్డట్టు చెప్పే కథనాలన్నీ నిజమేనా అన్న అనుమానాలు లేక పోలేదు. అదీగాక కరోనా వైరస్ కి సంబంధించిన యాంటీ వైరస్ ని చైనా ఇప్పటికే తయారు చేసుకుని ఉంచుకుందని వార్తలొస్తున్నాయి.

    ఇక కరోనా బాధితుల గణాంకాలు చూస్తే కరోనా వైరస్ పుట్టిన చైనాలో ఇప్పటి వరకు 81,053 కేసులు నమోదు కాగా అందులో 72,441 కేసులు రికవరీ అయ్యాయి. అదే ఇటలీలో మొత్తం 53,580 కేసులు నమోదు అయితే, అందులో కేవలం 6,070 మంది మాత్రమే రికవరీ అయ్యారు. ఇక మిగతా ప్రపంచ దేశాల గణాంకాలు కూడా ఇలానే ఉన్నాయి. రికవరీ కేసులు ఏమంత ఆశాజనకంగా లేవు.

    చివరగా తేలుతుంది ఏమిటంటే కరోనా వైరస్ పుట్టి పెరిగిన చైనాలో ఎక్కువ మంది వ్యాధి నుంచి కోలుకోవడం జరిగింది. ఆ లెక్కన చైనా దేశం కరోనా వైరస్ కి విరుగుడు గా యాంటీ వైరస్ ని ఆల్రెడీ తయారు చేసుకుందేమోనన్న అనుమానాలు మొలకెత్తు తున్నాయి. .