
హీరోలకు భజన చేయడమే తమ జీవిత ఆశయంగా భావించే బ్యాచ్ ఒకటి సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడూ ఉంటుంది. అలాగే ఇప్పుడు ఉంది, కాకపోతే ఆ బ్యాచ్ కి బై బర్తే ప్రెసిడెంట్ లా వ్యవహరిస్తుంటాడు బండ్ల గణేష్. అరె మైక్ దొరికితే చాలు.. పవన్ కళ్యాణ్ తోపు తురుము ఉరుము, వీరుడు, శూరుడు అంటూ అబ్బో.. ఆ పొగడ్తల దండకం వినాలంటేనే చిరాగ్గా ఉంటుంది. అయినా బండ్ల ఏమిటి అండి బాబు ? అంతలా భజన చేస్తున్నాడు ? అని భజన రాయుళ్లు కూడా భయపడుతున్నారు అంటేనే.. మనోడి భజన ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు.
అయినా భజన అనేది బాగానే ఉంటుంది గానీ, ఓవర్ అయితేనే మరీ ఎబ్బెట్టుగా ఉంటుంది, ఇప్పుడు బండ్ల భజన కూడా అలాగే మారిపోయింది. అయితే అసలు నిజంగా బండ్లలో కనీసం కొంత అయినా భక్తి ఉందా ? సరే ఉంది అనుకున్నాం, మరి పవన్ కళ్యాణ్ అంటే అంత భక్తి ఉన్నవాడు, పవన్ పార్టీలో ఎందుకు చెరలేదు ? అంటే రాజకీయంగా పవన్ పై నమ్మకం లేదా ? సరే ఇది వదిలేద్దాం, తన దేవుడికి కాంగ్రెస్ పార్టీ అంటే ద్వేషం కదా ! మరి అలాంటి కాంగ్రెస్ పార్టీలోకి 2018లో ఎందుకు చేరాడు? దేవుడు వ్యతిరేకిస్తోన్న పార్టీ తనకు కన్నతల్లి అని ఎందుకు అన్నాడు ?
ఏమిటి బండ్ల చెప్పు ? ఇలాంటి ప్రశ్నలు అడుగుతుంటే.. మధ్యలోనే ఇంటర్వ్యూలను ఆపేస్తున్నాడు బండ్ల. అయినా ఇంతవరకూ బండ్ల జనసేన సభ్యత్వం ఎందుకు తీసుకోలేదు ? బండ్ల గణేష్ ని ఆటలో అరటిపండుగా చూసినా, బండ్ల మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. ఏది ఏమైనా తనకంటూ ఒక క్రేజ్ మాత్రం సంపాదించుకున్నాడు బండ్ల. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానుల్లో తనకంటూ ఒక ఫ్యాన్ బేస్ ఏర్పాటు చేసుకుని.. యూట్యూబ్ లో టాప్ వన్ లో కూడా ట్రెండ్ అవుతున్నాడు. మొత్తానికి బండ్ల, మళ్లీ పవన్ ను బుట్టలో వేసే ప్రోగ్రామ్ ను బాగానే సెట్ చేసుకున్నాడు. పవనూ జాగ్రత్త.