Pan Card : పాన్ కార్డును పోగొట్టుకున్నారా.. కొత్త కార్డును ఎలా పొందాలంటే?

దేశంలో కోట్ల సంఖ్యలో ప్రజలు పాన్ కార్డును కలిగి ఉన్నారు. బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలతో పాటు కంపెనీలు అందించే ఆర్థిక సేవలను పొందాలంటే పాన్ కార్డును కచ్చితంగా కలిగి ఉండాలి. ప్రభుత్వ యాజమాన్య కంపెనీలు అందించే ఆర్థిక సేవలను పొందాలన్నా పాన్ కార్డు ఉండాలనే సంగతి తెలిసిందే. అయితే పాన్ కార్డును పోగొట్టుకుంటే ఏ మాత్రం కంగారు పడాల్సిన అవసరం లేదు. నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ కొత్త పాన్ కార్డును సులభంగా పొందవచ్చు. పాత […]

Written By: Kusuma Aggunna, Updated On : August 17, 2021 10:57 am
Follow us on

దేశంలో కోట్ల సంఖ్యలో ప్రజలు పాన్ కార్డును కలిగి ఉన్నారు. బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలతో పాటు కంపెనీలు అందించే ఆర్థిక సేవలను పొందాలంటే పాన్ కార్డును కచ్చితంగా కలిగి ఉండాలి. ప్రభుత్వ యాజమాన్య కంపెనీలు అందించే ఆర్థిక సేవలను పొందాలన్నా పాన్ కార్డు ఉండాలనే సంగతి తెలిసిందే. అయితే పాన్ కార్డును పోగొట్టుకుంటే ఏ మాత్రం కంగారు పడాల్సిన అవసరం లేదు.

నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ కొత్త పాన్ కార్డును సులభంగా పొందవచ్చు. పాత వివరాలతో కూడిన కొత్త కార్డును పొందడం ద్వారా ఇబ్బందులు పడకుండా తప్పించుకునే అవకాశాలు అయితే ఉంటాయి. అత్యవసరంగా పాన్ కార్డ్ అవసరం అయితే ఎలక్ట్రానిక్ పాన్ కార్డ్ డౌన్ లోడ్ చేసుకుని లావాదేవీలను జరపవచ్చు. ఆన్‌లైన్‌లో ఈ-పాన్‌ను డౌన్ లోడ్ చేసుకోవాలని అనుకునే వారు మొదట ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ టెక్నాలజీ అండ్ సర్వీసెస్ లిమిటెడ్ వెబ్ సైట్ కు లాగిన్ కావాలి.

https://www.utiitsl.com/ వెబ్ సైట్ లో పాన్ కార్డు సేవలను ఎంచుకుని డౌన్ లోడ్ ఈ పాన్ అనే ఆప్షన్ ఎంచుకోవాలి. ఆ తర్వాత పాన్ కార్డ్ వివరాలను నమోదు చేయాలి. అందులో పుట్టినతేదీ వివరాలను, క్యాప్చా వివరాలను సమర్పించడం ద్వారా మీ వివరాలను ధృవీకరించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఈ మెయిల్ ఐడి, రిజిస్టర్డ్ ఫోన్ నంబర్‌పై లింక్‌ ద్వారా వన్ టైమ్ పాస్ వర్డ్ ఎంటర్ చేయాలి.

వన్ టైమ్ పాస్ వర్డ్ ను నమోదు చేసిన తర్వాత ఈ -పాన్ కోసం మీ డౌన్‌లోడ్ ప్రారంభమయ్యే అవకాశాలు ఉంటాయి. ఆ విధంగా ఈ -పాన్ డౌన్‌లోడ్ చేసుకోవడంతో పాటు ఆన్‌లైన్‌లో అందించే వివిధ ఆర్థిక సేవల కోసం పాన్ కార్డును వినియోగించకూడదు.