Also Read: జనహిత రాజకీయమే ప్రభుత్వాలకు రక్ష
కొత్త టీపీసీసీపై మంగళవారమే ప్రకటన.. బాధ్యత స్వీకరణ ఉంటుందని కాంగ్రెస్ శ్రేణులు భావించాయి. అయితే కాంగ్రెస్ లో పెద్దఎత్తున లాబీయింగ్ నడుస్తుండటంతో క్షేత్రస్థాయిలో మరోసారి అభిప్రాయ సేకరణ చేపట్టాలని అధిష్టానం భావించింది. ఈమేరకు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి మాణిక్యం ఠాకూర్ ఇప్పటికే హైదరాబాద్ కు చేరుకున్నారు.
మూడురోజులపాటు ఆయన ఇక్కడే మకాంవేసి క్షేత్రస్థాయిలో టీపీసీసీపై అభిప్రాయం సేకరణ చేపట్టి అధిష్టానం విన్నవించనున్నారు. దీంతో టీపీసీసీ నియామకం మరింత ఆలస్యమయ్యేలా కన్పిస్తోంది. ప్రస్తుతం నియామకమయ్యే కొత్త టీపీసీసీ చీఫ్ అసెంబ్లీ ఎన్నికల వరకు కొనసాగే అవకాశం ఉండటంతో కాంగ్రెస్ సీనియర్లంతా ఈ పదవీ కోసం ఎవరికీవారు లాబీయింగ్ చేస్తున్నారు.
టీపీసీసీ రేసులో ప్రధానంగా ఎంపీలు రేవంత్‌రెడ్డి.. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు.. జగ్గారెడ్డి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డిలు ముందున్నారు. టీపీసీసీ ఈసారి బీసీ వర్గానికి కేటాయించాలని బీసీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. దీంతో వి.హన్మంతరావు.. పొన్నాల లక్ష్మయ్య.. పొన్నం ప్రభాకర్.. మధుయాష్కీగౌడ్ పేర్లు కూడా తెరపైకి వస్తున్నాయి.
Also Read: నేరేడ్ మెట్ గులాబీ ఖాతాలోకి.. 56కు చేరిన టీఆర్ఎస్ కార్పొరేటర్లు..!
ఎస్సీ వర్గం నుంచి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క.. మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనర్సింహ.. ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్ రేసులో ఉన్నారు. టీపీసీసీ కోసం పోటీ తీవ్రంగా ఉండటంతో అధిష్టానం గతంలో ఎన్నడూ లేనివిధంగా పలు ఏజెన్సీలతో సర్వేలు చేయించినట్లు సమాచారం.
మూడు రోజులపాటు నిర్వహించిన ఓ సర్వేలో మొత్తం 5.22లక్షల ఓట్లు పోలయ్యాయి. దీనిలో ఎంపీ రేవంత్‌రెడ్డికి ఒక్కడికే అత్యధికంగా 4.07లక్షలు ఓట్లు వచ్చినట్లు తెలుస్తోంది. అలాగే కోమటిరెడ్డికి 67వేలు.. భట్టి విక్రమార్కకు 26వేలు.. శ్రీధర్‌బాబుకు 20వేల ఓట్లు వచ్చినట్లు పార్టీవర్గాలు చెబుతున్నాయి. అయితే రేవంత్ కు టీపీసీసీ దక్కకుండా సీనియర్లు ఒకటవుతున్నారు. దీంతో టీపీసీసీ పదవీ ఎక్కరి దక్కుతుందా? అనే ఉత్కంఠత నెలకొంది.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్