వలంటీర్ల ఉద్యోగాల తొలగింపులో మర్మమేమిటి..?

ఆంధ్రప్రదేశ్లో జగన్ సర్కార్ ఏర్పడిన తరువాత మొదట నియామకాలను చేపట్టింది గ్రామ వలంటీర్లనే. ప్రభుత్వ సంక్షేమ పథకాలను నేరుగా ప్రజల వద్దకు తీసుకెళ్లేందుకు వలంటీర్ల సేవలను ఉపయోగించుకోవాలని అప్పట్లో పెద్ద ఎత్తున నియామకాలు చేపట్టింది. దీంతో అప్పటికే నిరుద్యోగం కోసం ఎదురుచూస్తన్న వారందరూ వలంటీర్ ఉద్యోగం కోసం పెద్ద ఎత్తున దరఖాస్తులు చేసుకున్నారు. ఇదే సమయంలో వైసీపీలోని కొందరు నేతలు సిఫారసు చేసి తమకు కావల్సిన వారందరినీ నియమించుకున్నారు. అయితే ప్రభుత్వం తాజాగా కొందరు వలంటీర్లను తొలగించాలని […]

Written By: NARESH, Updated On : December 9, 2020 8:25 pm
Follow us on

ఆంధ్రప్రదేశ్లో జగన్ సర్కార్ ఏర్పడిన తరువాత మొదట నియామకాలను చేపట్టింది గ్రామ వలంటీర్లనే. ప్రభుత్వ సంక్షేమ పథకాలను నేరుగా ప్రజల వద్దకు తీసుకెళ్లేందుకు వలంటీర్ల సేవలను ఉపయోగించుకోవాలని అప్పట్లో పెద్ద ఎత్తున నియామకాలు చేపట్టింది. దీంతో అప్పటికే నిరుద్యోగం కోసం ఎదురుచూస్తన్న వారందరూ వలంటీర్ ఉద్యోగం కోసం పెద్ద ఎత్తున దరఖాస్తులు చేసుకున్నారు. ఇదే సమయంలో వైసీపీలోని కొందరు నేతలు సిఫారసు చేసి తమకు కావల్సిన వారందరినీ నియమించుకున్నారు. అయితే ప్రభుత్వం తాజాగా కొందరు వలంటీర్లను తొలగించాలని యత్నిస్తోంది.

Also Read: కొనసాగుతున్న టీపీసీసీ ‘పంచాయితీ’..!

ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్లను పెద్ద ఎత్తున తీసేయాలని ఆదేశాలిచ్చింది. దీంతో ఒక్కసారిగా అందరూ కంగుతిన్నారు. దానికి ప్రభుత్వం చెబుతున్న కారణం వయసు ప్రభావం. 18 ఏళ్లలోపు వారిని, 35 ఏళ్లకు పై బడిన వయసు వారిని వెంటనే తొలగించాలని ప్రభుత్వం చెప్పడంతో అయోమయానికి గురవుతున్నారు. నిబంధనల ప్రకారం ఈ వయసు వారిని మాత్రమే వాలంటీర్లను నియమించుకోవాలని అందుకే మిగతా వారిని తీసేస్తున్నామని కొందరు ప్రభుత్వ ప్రతినిధులు అంటున్నారు.

వాలంటీర్లకు జీతాలు ప్రభుత్వ నిధుల నుంచి చెల్లిస్తున్నారు. దీంతో వారికి నిబంధనల ప్రకారం చెల్లించాలి. లేకపోతే కోర్టుకు పోయే అవకాశం ఉంది. అందులో 18 ఏళ్ల లోపు వారిని ప్రభుత్వమే నియమిస్తే చిక్కుల్లో పడుతుంది. కాగా వలంటీర్లలో కొందరు నిరక్షరాస్యులు కూడా ఉన్నారు. వీరికి వచ్చే వేతనాల విషయంలో కొన్ని పక్కదారి పడుతున్నట్లు వార్తలు వచ్చాయి. దీంతో ఈ విషయంలో ఎలాంటి చిక్కులు ఉండకుండా ప్రభుత్వం ముందు జాగ్రత్తగా వయసు కారణం చెప్పి తొలగించాలని ఆదేశించింది.

Also Read: ఆదుకోండి మహాప్రభో..! ఏలూరు బాధితుల గోడు..

అయితే వలంటీర్లను నియమించుకునేటప్పుడు ఇవి గుర్తుకు రాలేదా..? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. ప్రభత్వం తాము యువతకు ఉద్యోగాలు కల్పిస్తున్నామని చెప్పి ఇప్పుడు ఒకేసారి ఇంతమందిని తొలగిస్తే తమ భవితవ్యం ఏంటని ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి నియామకాల సమయంలో ప్రభుత్వం అన్ని నిబంధనల ప్రకారం చేస్తున్నామని చెప్పింది. దీనిపై కోర్టులో పిటిషన్లు దాఖలైనా రికార్డులతో సమాధానమిచ్చింది. అయితే ఇప్పడు వయసు నిబంధనతో ఉద్యోగాలు తొలగించడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్