ఆరోవ రోజు కాత్యాయణి మాతగా అమ్మవారు!

నవరాత్రులు మొదలై నేటితో ఆ రోజులు ఆరవ రోజున కావడంతో అమ్మవారు వారు కాత్యాయని మాతగా భక్తులకు దర్శనం ఇస్తారు. ఆశ్వయుజ మాసం లో మొదలయ్యే ఈ నవరాత్రులను భక్తులు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. ఈ తొమ్మిది రోజులు అమ్మవారిని భక్తి, శ్రద్ధలతో పూజిస్తారు. నవరాత్రులు మొదలవడంతో భక్తులలో పండగ వాతావరణం నెలకొంది. నవరాత్రుల లో భాగంగా బుధవారం ఆరో రోజు కావడంతో దుర్గామాత కాత్యాయినీ మాత అలంకరణలో దర్శనం ఇస్తారు. మన పురాణాల ప్రకారం కాత్యాయినీ […]

Written By: Navya, Updated On : October 22, 2020 9:46 am
Follow us on

నవరాత్రులు మొదలై నేటితో ఆ రోజులు ఆరవ రోజున కావడంతో అమ్మవారు వారు కాత్యాయని మాతగా భక్తులకు దర్శనం ఇస్తారు. ఆశ్వయుజ మాసం లో మొదలయ్యే ఈ నవరాత్రులను భక్తులు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. ఈ తొమ్మిది రోజులు అమ్మవారిని భక్తి, శ్రద్ధలతో పూజిస్తారు. నవరాత్రులు మొదలవడంతో భక్తులలో పండగ వాతావరణం నెలకొంది.

నవరాత్రుల లో భాగంగా బుధవారం ఆరో రోజు కావడంతో దుర్గామాత కాత్యాయినీ మాత అలంకరణలో దర్శనం ఇస్తారు. మన పురాణాల ప్రకారం కాత్యాయినీ మాత కొస్స అనే మహర్షి పార్వతి దేవి తనకు జన్మించాలని ఘోరమైన తపస్సు చేయడం ద్వారా పార్వతి దేవి ఆరుషికి జన్మిస్తుంది. అందువల్ల పార్వతీదేవిని కాత్యాయని దేవి అని కూడా పిలుస్తారు.

కాత్యాయనీ మాత నాలుగు చేతులతో భక్తులకు దర్శనమిస్తారు.ఎడమచేతిలో తామర పువ్వు, మరొక చేతిలో ఖడ్గాన్ని ధరించి ఉంటారు. కుడిచేతిలో అభయ, వరద అనే ముద్రలతో కొలువై ఉంటారు. ఆరవ రోజు కాత్యాయని అమ్మవారికి ఎరుపు రంగు చీరను దర్శిస్తారు. పూర్వం సీత ,గోపికలు అంతటి వారు కాత్యాయని దేవిని పూజించి మంచి భర్త రావాలని వేడుకుంటారు అని వాడుకలో ఉంది. అందువల్ల పెళ్లికాని అమ్మాయిలు కాత్యాయని మాతను పూజించడం ద్వారా మంచి భర్త దొరుకుతాడని నమ్ముతారు.

ఈరోజు అమ్మవారికి దద్దోజనం, రవ్వ కేసరి ఎంతో ఇష్టం. నైవేద్యంగా వీటినిసమర్పించడం ద్వారా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. మహిషాసురుని చంపటానికి సాక్షాత్తు ఆ బ్రహ్మ ,విష్ణు ,మహేశ్వరుల తేజస్సుతో ఒకరోజు కాత్యాయని మాతను సృష్టిస్తారు. కాత్యాయనీ మాత రూపంలో మహిషాసురు వద జరుగుతుంది.