ఇప్పటికే వర్షాలతో అతలాకుతలమవుతున్న హైదరాబాద్‌లో గురువారం భూ ప్రకంపణలు కలిగాయి. నగరంలోని వ్యవస్థలిపురం, బీఎన్‌రెడ్డి నగర్, వైదేహి నగర్ ప్రాంతంలో భూమి కదిలినట్లు స్థానికులు తెలిపారు. దీంతో ఇళ్లలోనుంచి అందరూ బయటకు వచ్చారు. ఉదయం జరిగిన ప్రకంపనలతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కాగా అంతకుముందు బోరుబండ తదితర ప్రాంతాల్లో ఇలాగే భూ ప్రకంపనలు రావడంతో సంబంధిత అధికారులు సాధారణమేనన్నారు. అయితే వర్షాల నేపథ్యంలో ఇలా భూమి కంపించడంతో ఏం జరుగుతుందోనని భయపడుతున్నారు.