https://oktelugu.com/

ఆర్ఆర్ఆర్: ఎన్టీఆర్ రిలీవ్.. లాకవుతున్న చరణ్..!

దర్శక దిగ్గజం రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుధిరం)’. ‘బాహుబలి’ సిరీసుల తర్వాత రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా ‘ఆర్ఆర్ఆర్’ను తెరకెక్కిస్తుంటంతో అభిమానులు ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. డీవీవీ దానయ్య అత్యంత భారీ బడ్జెట్లో ‘ఆర్ఆర్ఆర్’ను నిర్మిస్తుండగా కీరవాణి బాణీలను అందిస్తున్నాడు. Also Read: పాపం అనుపమా.. ఇక్కడ అదే బాధ ! ‘ఆర్ఆర్ఆర్’లో మెగా పవర్ స్టార్ రాంచరణ్ అల్లూరి సీతరామరాజుగా.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమురంభీంగా నటిస్తున్నారు. బాలీవుడ్ హీరోయిన్ అలియాభట్.. […]

Written By:
  • NARESH
  • , Updated On : November 19, 2020 / 04:49 PM IST
    Follow us on

    దర్శక దిగ్గజం రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుధిరం)’. ‘బాహుబలి’ సిరీసుల తర్వాత రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా ‘ఆర్ఆర్ఆర్’ను తెరకెక్కిస్తుంటంతో అభిమానులు ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. డీవీవీ దానయ్య అత్యంత భారీ బడ్జెట్లో ‘ఆర్ఆర్ఆర్’ను నిర్మిస్తుండగా కీరవాణి బాణీలను అందిస్తున్నాడు.

    Also Read: పాపం అనుపమా.. ఇక్కడ అదే బాధ !

    ‘ఆర్ఆర్ఆర్’లో మెగా పవర్ స్టార్ రాంచరణ్ అల్లూరి సీతరామరాజుగా.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమురంభీంగా నటిస్తున్నారు. బాలీవుడ్ హీరోయిన్ అలియాభట్.. హాలీవుడ్ నటి ఓలివియా హీరోయిన్లుగా నటిస్తున్నారు. బాలీవుడ్.. హాలీవుడ్ చెందిన పలువురు తారలు, సాంకేతిక నిపుణులు ఈ మూవీ కోసం పని చేస్తుండటం విశేషం.

    ‘ఆర్ఆర్ఆర్’ నుంచి ఇప్పటికే రిలీజైన ‘భీమ్ ఫర్ రామరాజు’.. ‘రామరాజు ఫర్ భీమ్’ టీజర్లు విడుదలై సోషల్ మీడియాలో సెన్సేషనల్ క్రియేట్ చేస్తున్నాయి. కరోనా ఎఫెక్టుతో ఆగిపోయిన ఈ మూవీ షూటింగ్ తిరిగి ఇటీవలే ప్రారంభమైంది. మేకింగ్ సంబంధించిన వీడియోను ఆర్ఆర్ఆర్ చిత్రయూనిట్ గతంలోనే విడుదల చేయగా వైరల్ అయింది.

    కొద్దిరోజులుగా ఆర్ఆర్ఆర్ నుంచి వరుస అప్డేట్స్ వస్తున్నాయి. ఇటీవల ఓ పోరాట సన్నివేశానికి సంబంధించిన వీడియో వైరల్ అయింది. తాజాగా ఆర్ఆర్ఆర్ టీం అర్థరాత్రి షూటింగ్ పరిస్థితులు ఎలా ఉంటాయో వెల్లడిస్తూ ఆర్ఆర్ఆర్ టీమ్ ఓ వీడియో సోషల్ మీడియా విడుదల చేయగా అదికూడా వైరల్ అయింది.

    Also Read: కుటుంబ సభ్యుల ఎంట్రీతో మారిన సీన్.. ఆందోళనలో బిగ్ బాస్..!

    ఇటీవలే విదేశాలకు వెళ్లొచ్చిన ఎన్టీఆర్ తిరిగి ‘ఆర్ఆర్ఆర్’ షూటింగులో పాల్గొనేందుకు సిద్ధమయ్యాడు. ఈక్రమంలో నవంబర్ 20(శుక్రవారం) నుంచి షూటింగులో పాల్గొనున్నాడు. జక్కన్న సైతం ‘ఆర్ఆర్ఆర్’లో షూటింగులో వేగం పెంచాడు. ముందుగా ఎన్టీఆర్ పార్ట్ కంప్లీట్ చేసి అతడిని రిలీవ్ చేసేందుకు సిద్ధపడుతున్నారు. చరణ్ మాత్రం ఆర్ఆర్ఆర్ కాంప్లీట్ అయ్యే వరకు ఉంటాడని తెలుస్తోంది.

    చరణ్ ‘ఆర్ఆర్ఆర్’తోపాటు ‘ఆచార్య’ చేస్తున్నాడు. దీంతో ‘ఆర్ఆర్ఆర్’ కోసం చరణ్ ఎక్కువ కాలం వెయిట్ చేశాననే ఫీలింగ్ కలుగకపోవచ్చు. ఇక ఎన్టీఆర్ కోసం దర్శకుడు త్రివిక్రమ్ వెయిట్ చేస్తుండగా ముందుగా అతడిని రిలీవ్ చేస్తే రాజమౌళికి కూడా కొంత టెన్షన్ తగ్గుంది. ఈ నేపథ్యంలో ముందుగా ఎన్టీఆర్ ను ‘ఆర్ఆర్ఆర్’ నుంచి బయటికి పంపి చరణ్ ను రాజమౌళి లాక్ చేయనున్నట్లు తెలుస్తోంది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్