https://oktelugu.com/

పాపం అనుపమా.. ఇక్కడ అదే బాధ !

సినిమా ఇండస్ట్రీలో కథానాయికలకు కమిట్మెంట్ గోల అనేది సర్వసాధారణం అయిపోయింది. ఇప్పటికే ఆ మధ్య మీటూ అంటూ ఓ రేంజ్ లో హీరోయిన్లు తమ కమిట్మెంట్ ల బాధలను ఒక్కొక్కరుగా వివరించుకున్నారు. మొత్తానికి హీరోయిన్ లను విసిగించడం, వేధించడం అనేది ఫిల్మ్ ఇండస్ట్రీకి ఆనవాయితీగా వస్తోంది. అయితే కొంతమంది కథానాయికలు ఈ విషయంలో బాహాటంగానే నోరువిప్పితే, మరి కొంతమంది కామ్ గా అన్ని భరించి కెరీర్ ను ఎలాగోలా నడిపిస్తూ ఉంటారు. కానీ ఇలాంటి వాటికి దూరంగా […]

Written By:
  • admin
  • , Updated On : November 19, 2020 / 04:48 PM IST
    Follow us on


    సినిమా ఇండస్ట్రీలో కథానాయికలకు కమిట్మెంట్ గోల అనేది సర్వసాధారణం అయిపోయింది. ఇప్పటికే ఆ మధ్య మీటూ అంటూ ఓ రేంజ్ లో హీరోయిన్లు తమ కమిట్మెంట్ ల బాధలను ఒక్కొక్కరుగా వివరించుకున్నారు. మొత్తానికి హీరోయిన్ లను విసిగించడం, వేధించడం అనేది ఫిల్మ్ ఇండస్ట్రీకి ఆనవాయితీగా వస్తోంది. అయితే కొంతమంది కథానాయికలు ఈ విషయంలో బాహాటంగానే నోరువిప్పితే, మరి కొంతమంది కామ్ గా అన్ని భరించి కెరీర్ ను ఎలాగోలా నడిపిస్తూ ఉంటారు. కానీ ఇలాంటి వాటికి దూరంగా ఉండేవారు మాత్రం.. టోటల్ గా సినిమాలకే దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు ఈ లిస్ట్ లో ఓ లీడింగ్ హీరోయిన్ కూడా చేరబోతుంది అంటూ టాక్ నడుస్తోంది.

    Also Read: కాజల్ పెళ్లి ఖర్చు కంటే.. హనీమూన్ ఖర్చే ఎక్కువ.. షాకవుతున్న ఫ్యాన్స్..!

    మలయాళ బ్యూటీ అనుపమా పరమేశ్వరన్ కు టాలీవుడ్ లో కమిట్మెంట్ ల సెగ బాగా తగిలిందట. ఇలాంటివి నేను భరించలేను బాబోయ్ అంటూ అనుపమా పరమేశ్వరన్ ఓ సినిమా నుండి తప్పుకునట్లు తెలుస్తోంది. పాపం అచ్చతెలుగు అమ్మాయిలా కనిపించే ఈ మలయాళీ ముద్దుగుమ్మకు ఎంత కష్టం వచ్చింది. నిజానికి అనుపమ సొంత భాషలో మూడు సినిమాలే చేసింది. మలయాళంలో అవకాశాలు చాలా వచ్చినా.. అన్ని వదులుకుని తెలుగులో నటించడానికే ఎక్కువ ఆసక్తి చూపించింది. కానీ, తెలుగులో అనుకున్నంత వేగంగా లేదామె కెరీర్. మంచి నటిగా పేరున్నా అవకాశాలు మాత్రం అంతంత మాత్రంగానే వస్తున్నాయి.

    Also Read: ఇండస్ట్రీలో కలకలం: మెగాస్టార్ ఎందుకిలా చేస్తున్నాడు?

    ఇప్పుడు ఆ అవకాశాల్లో కూడా ఆమెకు ఇబ్బందులు వస్తుండటంతో ఏం చేయాలో తెలియక మొత్తానికి సినిమాల నుండే తప్పుకుంటుంది. మొదట్లో మలయాళంలో కూడా అనుపమకు ఇదే సమస్య ఎదురైందట. తన మనసు గాయపడటం వల్లే మాలీవుడ్‌‌‌‌కి అనుపమ దూరంగా ఉందట. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఈ విషయం గురించి అనుపమ చెబుతూ…”నేను తొలిసారి ‘ప్రేమమ్’లో చిన్న పాత్ర చేయడం జరిగింది. ఆ తరువాత వచ్చిన కొన్ని ఆఫర్ ల వల్ల కొన్ని ఇబ్బందులు పడ్డాను. అప్పుడు చాలా హర్టయ్యాను. అప్పటికి మరీ చిన్నదాన్ని కదా. అందుకే కొన్నాళ్లు మలయాళ సినిమాలకి దూరంగా ఉండాలనుకున్నాను. మరి ఇప్పుడు తెలుగు సినిమాలకు కూడా ఇదే జరిగింది. మరి ఇప్పుడు అనుపమ ఏమి చేస్తోందో చూడాలి.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్