https://oktelugu.com/

సింగర్ సునీత ప్రీ వెడ్డింగ్ పార్టీలో హోస్ట్ గా హీరో ?

సింగర్ సునీత పెళ్లి చేసుకుంటున్నానని ప్రకటించిన నాటి నుండి మీడియాలో ఆమె పెళ్ళికి సంబంధించిన ఏదొక న్యూస్ చక్కెర్లు కొడుతూనే ఉంది. ఇటీవలే ఈ పెళ్లికి సంబంధించిన నిశ్చితార్థం అనంతరం పెళ్లి చేసుకుంటున్నానని సునీత అధికారికంగా ప్రకటించడంతో అందరిలో ఆసక్తి రెట్టింపు అయింది. సునీతని పెళ్లి చేసుకునే వరుడు గురించి ,పెళ్లి తేదీల గురించి అప్పుడంటూ ఇప్పుడంటూ అదంటూ ఇదంటూ రకరకాల ఊహాగానాలు మీడియా, సోషల్ మీడియా లో ప్రసారం చేస్తున్నారు. రీసెంట్ గా ఒక వస్త్ర […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 21, 2020 / 02:40 PM IST
    Follow us on


    సింగర్ సునీత పెళ్లి చేసుకుంటున్నానని ప్రకటించిన నాటి నుండి మీడియాలో ఆమె పెళ్ళికి సంబంధించిన ఏదొక న్యూస్ చక్కెర్లు కొడుతూనే ఉంది. ఇటీవలే ఈ పెళ్లికి సంబంధించిన నిశ్చితార్థం అనంతరం పెళ్లి చేసుకుంటున్నానని సునీత అధికారికంగా ప్రకటించడంతో అందరిలో ఆసక్తి రెట్టింపు అయింది. సునీతని పెళ్లి చేసుకునే వరుడు గురించి ,పెళ్లి తేదీల గురించి అప్పుడంటూ ఇప్పుడంటూ అదంటూ ఇదంటూ రకరకాల ఊహాగానాలు మీడియా, సోషల్ మీడియా లో ప్రసారం చేస్తున్నారు. రీసెంట్ గా ఒక వస్త్ర దుకాణం ఓపెనింగ్ కి వచ్చిన సునీత స్వయంగా మీడియాతో మాట్లాడుతూ…పెళ్లి గురించి ఇష్టమొచ్చినట్లు రాయకండి, డేట్ ఎప్పుడు ఏంటి అనేది నేనే ప్రకటిస్తాను అని చెప్పి ఊహాగానాలకు పుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేసింది.

    Also Read: పవన్ ని ఢీ కొట్టనున్న రానా… ఆ క్రేజీ రీమేక్ స్టార్ట్

    ఆమె చెప్పిందని గాసిప్ రాయుళ్లు ఊరుకుంటారా… ఇప్పుడు సునీత పెళ్ళికి సంబంధించి ఫోటోలతో సహా మరో విషయం కూడా వైరల్ అవుతుంది. కాబోయే భ్యార్యా భర్తలు ఇద్దరూ కలిసి తమ సన్నిహితులకు ప్రీ వెడ్డింగ్‌ పార్టీ ఇచ్చారు. దీనికి సంబందించిన ఫొటోలు కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.ఈ పార్టీని రామ్‌కి అత్యంత సన్నిహితుడైన హీరో నితిన్‌ ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. ఇ దే అందరికి ఆశ్చర్యకరంగా ఉందట. రామ్, నితిన్ కి మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయని అనుకుంటున్నారు.

    Also Read: పెళ్లెప్పుడంటే… కొట్టేస్తా అంటున్న సింగర్ సునీత

    ఈ ప్రీ వెడ్డింగ్ పార్టీలో సునీత, రామ్‌లు కేక్‌ కట్‌ చేసి సందడి చేశారు. ఈ పార్టీకి ఇండస్ట్రీలోని కొందరు సింగర్స్‌తో పాటు చాలా తక్కువ మంది నటులు హాజరైనట్లుగా సమాచారం. హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలోని ఓ స్టార్ హోటల్‌లో సునీత, రామ్ వీరపనేని ప్రీ వెడ్డింగ్ పార్టీ జరిగింది. డిసెంబర్ 19 రాత్రి జరిగిన ఈ వేడుకకు పవన్ కళ్యాణ్ మాజీ భార్య, సునీత బెస్ట్ ఫ్రెండ్ రేణు దేశాయ్ వచ్చింది. సింగర్ సునీతకు ఇండస్ట్రీలో ఉన్న మరో బెస్ట్ ఫ్రెండ్ సుమ కనకాల కూడా ప్రీ వెడ్డింగ్ పార్టీలో దర్శనమిచ్చింది. రేణుతో కలిసి సుమ, సునీత దిగిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్