https://oktelugu.com/

మహేష్ బాబు కసరత్తులు.. ‘రాజమౌళి కోసమేనా?

నేషనల్ స్టార్ డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి తన తర్వాత సినిమా మహేష్ తో చేయబోతున్న సంగతి తెలిసిందే. అయితే, ప్రస్తుతం మహేష్ బాబు తన ఫిట్ నెస్ పై ఫోకస్ పెట్టాడు. తాజాగా మహేష్ వర్కవుట్ చేస్తున్న వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఆ వీడియోలో మహేష్ ‘బాక్స్ జంప్స్’ చేస్తూ కనిపించాడు. ఈ వీడియోను చూసి మహేష్ అభిమానులు తెగ సంబరపడుతున్నారు, ఇక మహేష్ చేస్తోన్న ఈ ‘బాక్స్ జంప్స్’ కేవలం రాజమౌళి సినిమా కోసమే […]

Written By:
  • admin
  • , Updated On : January 21, 2021 / 02:42 PM IST
    Follow us on


    నేషనల్ స్టార్ డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి తన తర్వాత సినిమా మహేష్ తో చేయబోతున్న సంగతి తెలిసిందే. అయితే, ప్రస్తుతం మహేష్ బాబు తన ఫిట్ నెస్ పై ఫోకస్ పెట్టాడు. తాజాగా మహేష్ వర్కవుట్ చేస్తున్న వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఆ వీడియోలో మహేష్ ‘బాక్స్ జంప్స్’ చేస్తూ కనిపించాడు. ఈ వీడియోను చూసి మహేష్ అభిమానులు తెగ సంబరపడుతున్నారు, ఇక మహేష్ చేస్తోన్న ఈ ‘బాక్స్ జంప్స్’ కేవలం రాజమౌళి సినిమా కోసమే అని తెలుస్తోంది.

    Also Read: తన ప్రియుడు పై పెళ్లి పై హీరోయిన్ ముచ్చట్లు !

    కాగా ఎప్పటిలాగే రాజమౌళి తరువాత సినిమాలో మహేష్ బాబుతో చేసినా.. అది కూడా మల్టీస్టారరే అని.. మహేష్ తో పాటు మరో స్టార్ హీరో కూడా సినిమాలో ఉంటాడని మళ్ళీ రూమర్స్ స్టార్ అయ్యాయి. అయితే, ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని తెలుస్తోంది. రాజమౌళి – మహేష్ సినిమాకి సంబంధించి రచయిత విజయేంద్ర ప్రసాద్ కథను కూడా పూర్తి చేసారట. ఈ సినిమా ఛత్రపతి శివాజీ చరిత్ర ఆధారంగా రాబోతోందట. మహేష్ బాబు ఈ సినిమాలో ఛత్రపతి శివాజీగా నటిస్తున్నాడట. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో చూడాలి.

    Also Read: బయటపడ్డ యాంకర్ ప్రదీప్ మరో కోణం !

    ఏది ఏమైనా ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో ఇంకా క్లారిటీ లేదు. ఇక రాజమౌళి, మహేష్ సినిమా సెట్స్ కోసం డిజైన్ చేయిస్తున్నాడని ఇప్పటికే వార్తలు వచ్చాయి. మహేష్ సినిమా పై వర్క్ చేయడానికి కారణం రాజమౌళి టైం వేస్ట్ చేయకూడదు అనే ఉదేశ్యమేనట. ఇక ప్రసుతం మహేష్ పరుశురామ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది సగానికి ఈ సినిమా పూర్తయిపోతుంది.