
టాలీవుడ్ అగ్రహీరోలు చిరంజీవి, వెంకటేశ్, బాలయ్య, నాగార్జున ఎలాగూ ప్రేమకథలు చేయలేరు.. ఆ తరువాత నడివయసు వారైన మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, రాంచరణ్ లు ఆ వయసు దాటేశారు. ఇక యూత్ లో అంతో ఇంతో ఫాలోయింగ్ ఉండి ప్రేమకథలు చేసే అవకాశం యువ హీరోలకే ఉంది. అందులో లవర్ బాయ్ నితిన్ కు అమ్మాయిల్లో మంచి పేరుంది.
కానీ ఎందుకో పెళ్లి అయ్యాక హీరో నితిన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. చిన్న వయసే అయినా కూడా ఇక తాను మళ్లీ ప్రేమకథా చిత్రాలు చేయదలుచుకోలేదని ప్రకటించారు.
ప్రస్తుతం లవ్ స్టోరీ ‘రంగ్ దే’ చిత్రంలో నితిన్ నటిస్తున్నారు. ఈ కథ బాగుండడం వల్లే తాను ఒప్పుకున్నానని.. ఇక తాను ప్రేమ కథా చిత్రాలు చేయనని నితిన్ సంచలన ప్రకటన చేశాడు.
స్క్రిప్ట్ నచ్చితే ప్రయోగాత్మక చిత్రమైనా.. పక్కా కమర్షియల్ సినిమా అయినా చేస్తానని నితిన్ తెలిపాడు. ప్రేమకథలు మాత్రం చేయనని కుండబద్దలు కొట్టాడు.
ప్రస్తుతం నితిన్ ‘అంధాధూన్’ రిమేక్ లో నటిస్తున్నాడు. ఇందులో అంధుడిగా సవాల్ అయిన పాత్రలో జీవిస్తున్నాడు.
Comments are closed.