తప్పులో కాలేసిన ‘నిమ్మగడ్డ’

వరుస వివాదాల్లో చిక్కుకుంటున్న ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తన పంధా మార్చుకుంటున్నారు. ఏపీ ఎన్నికల విషయంలో తనదైన శైలిలో ముందుకు సాగిన రమేశ్ బాబు ఇప్పుడు తీరు మార్చుకున్నారు. తొందరపాటు నిర్ణయాలు.. అనాలోచిత ఉత్తర్వులతో ఆగమాగం అవుతున్న నిమ్మగడ్డ మరోసారి తాను చేసిన పొరపాటుపై తీవ్రస్థాయిలో ఆలోచనలో పడ్డారు. ఏపీ స్థానిక సంస్థల ఎన్నిలక నిర్వహణకు ఎస్ఈసీ మొదట నోటిఫికేషన్ విడుదల చేస్తానని ప్రకటించారు. అయితే ఇప్పడు వ్యాక్సినేషన్ జరుగుతోంది…. సమయం ఇది కాదని […]

Written By: NARESH, Updated On : January 26, 2021 3:34 pm
Follow us on

వరుస వివాదాల్లో చిక్కుకుంటున్న ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తన పంధా మార్చుకుంటున్నారు. ఏపీ ఎన్నికల విషయంలో తనదైన శైలిలో ముందుకు సాగిన రమేశ్ బాబు ఇప్పుడు తీరు మార్చుకున్నారు. తొందరపాటు నిర్ణయాలు.. అనాలోచిత ఉత్తర్వులతో ఆగమాగం అవుతున్న నిమ్మగడ్డ మరోసారి తాను చేసిన పొరపాటుపై తీవ్రస్థాయిలో ఆలోచనలో పడ్డారు. ఏపీ స్థానిక సంస్థల ఎన్నిలక నిర్వహణకు ఎస్ఈసీ మొదట నోటిఫికేషన్ విడుదల చేస్తానని ప్రకటించారు. అయితే ఇప్పడు వ్యాక్సినేషన్ జరుగుతోంది…. సమయం ఇది కాదని జగన్ సర్కారు అడ్డు తగిలింది. ఈ నేపథ్యంలో హైకోర్టు నుంచి ఉత్తర్వులు తెచ్చుకున్నారు రమేశ్ బాబు.. దీంతో ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. దీంతో సోమవారం తీర్పు వెల్లడించిన సుప్రీం.. ఎన్నికలకు పచ్చజెండా ఊపింది ఈ నేపథ్యంలో నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఎన్నికలకు సిద్ధమవ్వాల్సింది పోయి.. తాను చేసిన తప్పేంటో.. గ్రహించుకుని సవరించుకునే పనిలో పడ్డారు.

విషయంలో ఏంటంటే.. ఏపీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ మరోసారి తప్పులో కాలేశారు. తప్పుల తడకగా తయారైన పంచాయతీ ఎన్నికల రీ నోటిఫికేషన్‌ను తొందరపాటులో జారీచేశారు. సోషల్‌ మీడియాలో సోమవారం వైరల్‌ అయిన ఈ విషయంలోని సారాంశం ఏంటంటే.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ ఈ నెల 23న విడుదల చేసిన నోటిఫికేషన్‌ ప్రకారం రాష్ట్రంలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ఈనెల 25వ తేదీ సోమవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలు కావాలి. అయితే, రాష్ట్ర ప్రభుత్వం ఈ ఎన్నికలపై సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేయడం.. తదితర కారణాలతో ఎక్కడా నామినేషన్ల ప్రక్రియ మొదలుకాలేదు.

రెండు, మూడు, నాలుగో విడతలో జరగాల్సిన ఎన్నికలను అదే తేదీలతో ఒకటవ, రెండో, మూడో విడతలుగానూ, తొలి విడతలో జరగాల్సిన ఎన్నికలను నాల్గవ విడతకు మారుస్తూ నిమ్మగడ్డ సవరణ నోటిఫికేషన్‌ జారీచేశారు. అయితే, ఈ నోటిఫికేషన్‌లో నాల్గవ విడత ఎన్నికలకు ఫిబ్రవరి 10 నుంచి నామినేషన్ల ప్రక్రియ అని ఉండాల్సి ఉండగా.. జనవరి 10 నుంచి నామినేషన్లను స్వీకరించనున్నట్లు పేర్కొంటూ నోటిఫికేషన్‌ తయారైంది. దీని నిమ్మగడ్డ జారీ చేసేశారు. ఎప్పటిలాగే ఎస్‌ఈసీ కార్యాలయం.. ఈ విషయాన్ని ఓ వర్గం మీడియాకు లీక్‌ చేసేసింది. ఆ మీడియా ద్వారా జరిగిన తప్పు తెలుసుకున్న నిమ్మగడ్డ.. నోటిఫికేషన్‌ను సరిచేసి జరిగిన తప్పును దిద్దుకున్నారు.