కేంద్రంపై దండెత్తుకొస్తున్న రైతులు.. తీవ్ర ఉద్రిక్తత

సాగు చట్టాలపై రైతులు చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. గణతంత్ర దినోత్సవాన అటు పరేడ్‌ నడుస్తుండగా.. ఇటు రైతులు ట్రాక్టర్ ర్యాలీ చేపట్టారు. 72వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించతలపెట్టిన ‘కిసాన్ గణతంత్ర పరేడ్‌’ అనుమతించిన సమయాని కంటే ముందే రైతులు ర్యాలీ ప్రారంభించారు. మరోవైపు రాజ్‌పథ్‌లో గణతంత్ర వేడుకలు జరుగుతుండడంతో రైతులను నిలువరించేందుకు పోలీసులు ప్రయత్నించారు. Also Read: చదువు నేర్పిన మూర్ఖత్వం.. : బిడ్డలను చంపుకున్న కన్నపేగు.. రైతుల ర్యాలీ.. అడ్డుకోవాలని పోలీసుల […]

Written By: Srinivas, Updated On : January 26, 2021 3:40 pm
Follow us on


సాగు చట్టాలపై రైతులు చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. గణతంత్ర దినోత్సవాన అటు పరేడ్‌ నడుస్తుండగా.. ఇటు రైతులు ట్రాక్టర్ ర్యాలీ చేపట్టారు. 72వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించతలపెట్టిన ‘కిసాన్ గణతంత్ర పరేడ్‌’ అనుమతించిన సమయాని కంటే ముందే రైతులు ర్యాలీ ప్రారంభించారు. మరోవైపు రాజ్‌పథ్‌లో గణతంత్ర వేడుకలు జరుగుతుండడంతో రైతులను నిలువరించేందుకు పోలీసులు ప్రయత్నించారు.

Also Read: చదువు నేర్పిన మూర్ఖత్వం.. : బిడ్డలను చంపుకున్న కన్నపేగు..

రైతుల ర్యాలీ.. అడ్డుకోవాలని పోలీసుల ప్రయత్నాలు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తొలుత టిక్రీ సరిహద్దు నుంచి ట్రాక్టర్లు ర్యాలీగా బయలుదేరాయి. ర్యాలీ ప్రారంభానికి ఇంకా సమయం ఉండడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన రైతులు వారితో ఘర్షణకు దిగారు. బారీకేడ్లను సైతం రైతులు తొలగించారు. సింఘు, ఘాజీపూర్‌‌ ప్రాంతాల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది.

మరోవైపు.. ముకర్బా ప్రాంతంలో బారికేడ్లను తొలగించే క్రమంలో ఆందోళనకారులు పోలీసుల వాహనంపైకి ఎక్కారు. దీంతో వారిని నియంత్రించేందుకు ఓ దశలో పోలీసులు టియర్‌‌ గ్యాస్‌ ప్రయోగించారు. ఈ క్రమంలో తలెత్తిన ఘర్షణలో భద్రతాబలగాల వాహనాలు స్వల్పంగా ధ్వంసమయ్యాయి. ఇంతలో రాజ్‌పథ్‌లో గణతంత్ర పరేడ్‌ ముగియడంతో పోలీసులు వెనక్కి తగ్గి ర్యాలీ ముందుకు సాగేందుకు పర్మిషన్‌ ఇచ్చారు.

Also Read: ఏపీలో ‘పంచాయితీ’ హీట్‌

ఇదిలా ఉండగా.. ర్యాలీలో పాల్గొనేందుకు పొరుగు రాష్ట్రాల నుంచి వేలాది మంది రైతులు ఉదయం కాగానే ట్రాక్టర్లతో ఢిల్లీకి చేరుకున్నారు. పంజాబ్‌, హరియాణాతోపాటు ఉత్తరప్రదేశ్‌ నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చారు. ప్రతి ట్రాక్టర్‌‌కు జాతీయ జెండా ఏర్పాటు చేశారు. మరోవైపు మహిళలు, పురుషులు ట్రాక్టర్లలో సంప్రదాయ నృత్యాలు, నాటకాలు ప్రదర్శించారు. పోలీసులు డ్రోన్‌ కెమెరాలతో ర్యాలీని ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు.

మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్