2020కి బైబై చెప్పేసిన న్యూజిలాండ్..!

ఇండియాలో న్యూ ఇయర్ వేడులకు ఇంకా సమయం ఉండగానే కొన్నిదేశాలు కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టాయి. న్యూజిలాండ్ దేశం ఇప్పటికే 2020కి గుడ్ బై చెప్పేసి 2021కు వెల్ కమ్ చెప్పేసింది. Also Read: విద్యార్థులకు క్రెడిట్ కార్డులు ఇస్తున్న ప్రముఖ బ్యాంకులు.. ఎలా పొందాలంటే..? ఆ దేశంలో న్యూ ఇయర్ వేడుకలు అప్పుడే షూరు అయ్యాయి. జనవరి 1వ తేదిని ఆదేశం ఘనంగా జరుపుకుంటోంది. ప్రతీయేటా మాదిరిగానే న్యూజిలాండ్ దేశం కొత్త సంవత్సరానికి గ్రాండ్ గా వెల్ […]

Written By: Neelambaram, Updated On : December 31, 2020 7:59 pm
Follow us on

ఇండియాలో న్యూ ఇయర్ వేడులకు ఇంకా సమయం ఉండగానే కొన్నిదేశాలు కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టాయి. న్యూజిలాండ్ దేశం ఇప్పటికే 2020కి గుడ్ బై చెప్పేసి 2021కు వెల్ కమ్ చెప్పేసింది.

Also Read: విద్యార్థులకు క్రెడిట్ కార్డులు ఇస్తున్న ప్రముఖ బ్యాంకులు.. ఎలా పొందాలంటే..?

ఆ దేశంలో న్యూ ఇయర్ వేడుకలు అప్పుడే షూరు అయ్యాయి. జనవరి 1వ తేదిని ఆదేశం ఘనంగా జరుపుకుంటోంది. ప్రతీయేటా మాదిరిగానే న్యూజిలాండ్ దేశం కొత్త సంవత్సరానికి గ్రాండ్ గా వెల్ కమ్ చెప్పేసింది.

ప్రతీయేటా ఆక్లాండ్ లో బాణాసంచా పేలుళ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఈసారి ఆక్లాండ్‌లో ఐదు నిమిషాలపాటు బాణాసంచా పేల్చారు. దీంతో హార్బర్ బ్రిడ్జ్ బాణ‌సంచా వెలుగుల‌తో నిండిపోయింది.

అదేవిధంగా వెల్లింగ్టన్‌లోనూ లైవ్ మ్యూజిక్‌తో ప్రజ‌లు కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు. భారత్‌ కంటే న్యూజిలాండ్ సమయం 7.30 గంట‌ల ముందే ఉంటుంది. దీంతో అక్కడ ముందుగానే న్యూ ఇయర్ వేడుకలు జరుగుతున్నాయి.

Also Read: జియో కస్టమర్లకు బంపర్ ఆఫర్.. ఉచితంగా వాయిస్ కాల్స్..?

అయితే కరోనా మహమ్మరి కారణంగా ప్రపంచంలోని చాలాదేశాలు న్యూ ఇయర్ వేడుకలను సింపుల్ గా జరుపుకుంటున్నాయి. అట్టహాసాలకు దూరంగా ఉంటున్నాయి. ఇక భారత్ లో అర్ధరాత్రి 12 తర్వాత న్యూ ఇయర్ వేడుకలు ప్రారంభం కానున్నాయి.

కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే న్యూయర్ వేడుకలపై ఆంక్షలు విధించగా మరికొన్ని రాష్ట్రాల్లో కరోనా నిబంధనలు పాటిస్తూ వేడుకలు జరుగనున్నాయి. మరికొన్ని గంటల్లో ఇండియా సైతం 2020కి గుడ్ బై చెప్పి 2021కు వెల్ కమ్ చెప్పబోతుంది.