Homeఎంటర్టైన్మెంట్మా పిల్లల్ని ఆకతాయిలుగా పెంచం - విరుష్క

మా పిల్లల్ని ఆకతాయిలుగా పెంచం – విరుష్క

Anushka Sharma poses with baby bump
తాను అలాగే తన భర్త విరాట్ కోహ్లీ అవలంబించే తల్లిదండ్రుల విధానం గురించి నటి అనుష్క శర్మ వోగ్ పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూ లో మాట్లాడారు. ఈ ఏడాది ఆగస్టులో అనుష్క శర్మ తన ప్రెగ్నన్సీ విషయాన్నీ సోషల్ మీడియా ద్వారా ప్రపంచానికి తెలియజేసిన సంగతి తెలిసిందే. వారిరువురు కలిసి ఉన్న సంతోషకరమైన చిత్రాన్ని పోస్ట్ చేస్తూ, ” జనవరి 2021కి మేము ముగ్గురమవుబోతున్నాం ” అని పెట్టిన పోస్ట్ బాగా వైరల్ అయ్యింది. ఇక అప్పటి నుండి వారి మీద అభిమానులు మరియు సామాన్య ప్రజానీకానికి ప్రత్యేక ఆసక్తి పెరిగింది. అనుష్క, విరాట్ తల్లిదండ్రులాగా మారడానికి మరి కొద్దీ రోజులు మాత్రమే ఉన్నాయి.

Also Read: సూపర్‌ స్టార్‌ నిర్ణయం పై మోహన్ బాబు రియాక్షన్ !

ఇలాంటి సమయంలో ఫ్యాషన్ మ్యాగజైన్ వోగ్ ఇండియా ప్రసూతి ఫోటోషూట్లో అనుష్క శర్మ పాల్గొంది. ఆ సందర్బంగా ఈ పత్రికతో జరిగిన సంభాషణలో, “మనం మనుషులుగా జీవితాన్ని జీవించే విధానంలో చాలా సారూప్యతలు ఉన్నాయి. నేను అభ్యుదయ భావాలు గల కుటుంబం నుంచి వచ్చాను. ఇప్పుడు నా ఇంట్లో కూడా అదే వాతావరణం ఉంటుంది. అన్ని విషయాల్లో మా ఇద్దరి ఆలోచనలు ఒకే విధంగా ఉంటాయి. ఇప్పటికే పిల్లల్ని పెంచే విషయంలో తల్లి దండ్రులు అనుసరించాల్సిన విధానం మీద ఇద్దరికీ అవగాహన ఉంది. “మా పిల్లలు ఇతరులకు గౌరవం ఇచ్చేలా పెంచుతాం. విలువలతో కూడిన జీవనం సాగించేలా తీర్చిదిద్దుతాం. వారిని ఆకతాయిలుగా పెంచడం మాకు ఇష్టం లేదు’’ అని అన్నారు. అంతేకాకుండా పిల్లలతో పైకి కాస్త కఠినంగా వ్యవహరించినట్లుగా కనిపించినా అందులో ప్రేమ ఇమిడి ఉందనే నిజాన్ని వారికి తెలిసేలా చేస్తానని పేర్కొన్నారు.

Also Read: చరణ్ తో ‘జెర్సీ’ డైరెక్టర్ భారీ యాక్షన్ !

అనుష్క చేసిన ఈ ఫోటోషూట్ సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తొమ్మిది నెలల గర్భంతో కూడా ఆమె స్టైల్ గా కనిపించారు. అనుష్కకి ప్రముఖల నుండి అభినందనలు అందుతున్నాయి. విరాట్ కూడా నువ్వు చాలా అందంగా ఉన్నావంటూ కాంప్లిమెంట్స్ ఇచ్చాడు. కొద్దీ రోజుల క్రితం విరాట్ మెటర్నిటీ లీవ్ తీసుకుని ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో మొదటి టెస్ట్ ముగియగానే ఇండియాకి తిరిగి వచ్చేసాడు. ఇలాంటి సమయంలో భార్య తోడుగా ఉండాలని కోరుకుంటున్నట్లుగా ఆయన పేర్కొన్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం బాలీవుడ్ న్యూస్

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

1 COMMENT

Comments are closed.

Exit mobile version