కొత్త వైరస్ చాలా డేంజర్.. రీసెర్చ్ లో బయటపడుతున్న నిజాలు..!

కరోనా పేరు చెబితే ప్రపంచం హడలెత్తిపోతుంది. చైనాలోని వూహాన్లో వెలుగు చూసిన కరోనా ప్రపంచంలోని అన్ని దేశాలకు పాకింది. ఈ వైరస్ సృష్టించిన బీభత్సం ఇంకా కొనసాగుతూనే ఉంది. దీనికితోడు కరోనా కొత్త వైరస్ ప్రస్తుతం ప్రపంచాన్ని భయాందోళనలకు గురిచేస్తోంది. ఈ కొత్త వైరస్ వల్ల వచ్చే ఏడాదిలో భారీగా ప్రాణనష్టం ఉంటుందని లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్ రీసెర్చ్ పేర్కొనడం ఆందోళన రేపుతోంది. కరోనా వైరస్ పోల్చుకుంటే కొత్త 56శాతం ఎక్కువగా […]

Written By: Neelambaram, Updated On : December 25, 2020 11:02 am
Follow us on

carona

కరోనా పేరు చెబితే ప్రపంచం హడలెత్తిపోతుంది. చైనాలోని వూహాన్లో వెలుగు చూసిన కరోనా ప్రపంచంలోని అన్ని దేశాలకు పాకింది. ఈ వైరస్ సృష్టించిన బీభత్సం ఇంకా కొనసాగుతూనే ఉంది.

దీనికితోడు కరోనా కొత్త వైరస్ ప్రస్తుతం ప్రపంచాన్ని భయాందోళనలకు గురిచేస్తోంది. ఈ కొత్త వైరస్ వల్ల వచ్చే ఏడాదిలో భారీగా ప్రాణనష్టం ఉంటుందని లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్ రీసెర్చ్ పేర్కొనడం ఆందోళన రేపుతోంది.

కరోనా వైరస్ పోల్చుకుంటే కొత్త 56శాతం ఎక్కువగా వ్యాపిస్తున్నట్లు లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్ రీసెర్చ్ తేలిపింది. దీని వల్ల అనారోగ్యానికి గురవడంతోపాటు ఎక్కువ మరణాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిపింది.

ఈ వైరస్ వల్ల వ్యాధి తీవ్రత ఎక్కువ లేదా తక్కువ అనే ప్రభావంపై స్పష్టమైన ఆధారాలపై ఇంకా పరిశోధనలు జరుగుతున్నయని లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్ రీసెర్చ్ బృందం వెల్లడించింది.

దీని కంటే ముందుగా యూకే చీఫ్ సైంటిఫిక్ అడ్వైజర్ ప్యాట్రిక్ వాలెన్స్ సైతం ఇదే ఈ విషయాన్ని వెల్లడించారు. కొత్త వైరస్ ఇతర వైరస్‌ల కంటే 70శాతం అంటువ్యాధిలా వ్యాపిస్తుందని తెలిపారు. ప్రజలంతా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు.