https://oktelugu.com/

గ్రేటర్లో కొత్త.. పాత కార్పొరేటర్ల మధ్య ఆధిపత్య పోరు..!

జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 4నే వెల్లడయ్యాయి. మొత్తం 150 డివిజన్లకు జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ కు 56.. బీజేపీకి 48.. ఎంఐఎంకు 44.. కాంగ్రెస్ కు రెండు సీట్లు వచ్చాయి. దీంతో గ్రేటర్ హంగ్ ఏర్పడింది. గ్రేటర్ ఎన్నికల్లో నగరవాసులు ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ ఇవ్వలేదు. అయితే ఈసారి అనుహ్యంగా ప్రభుత్వం గ్రేటర్ ఎన్నికలను ముందస్తుగా నిర్వహించింది. ప్రస్తుత పాలకవర్గం ఫిబ్రవరి 10వరకు కొనసాగనుంది. Also Read: నువ్వుల పేరుతో నిధులు స్వాహా.. అక్షరాల […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 17, 2020 / 01:25 PM IST
    Follow us on

    జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 4నే వెల్లడయ్యాయి. మొత్తం 150 డివిజన్లకు జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ కు 56.. బీజేపీకి 48.. ఎంఐఎంకు 44.. కాంగ్రెస్ కు రెండు సీట్లు వచ్చాయి. దీంతో గ్రేటర్ హంగ్ ఏర్పడింది.

    గ్రేటర్ ఎన్నికల్లో నగరవాసులు ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ ఇవ్వలేదు. అయితే ఈసారి అనుహ్యంగా ప్రభుత్వం గ్రేటర్ ఎన్నికలను ముందస్తుగా నిర్వహించింది. ప్రస్తుత పాలకవర్గం ఫిబ్రవరి 10వరకు కొనసాగనుంది.

    Also Read: నువ్వుల పేరుతో నిధులు స్వాహా.. అక్షరాల ఎంతంటే?

    దీంతో కొత్త ఎన్నికైనా కార్పొరేటర్లు మరో రెండు నెలలుగా ఉత్సవ విగ్రహాలుగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే కొత్త కార్పేటర్లు గెలిచిన డివిజన్లలో పాత కార్పొరేటర్లు పనులు చేస్తుండటంతో వీరి మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది.

    గ్రేటర్ పరిధిలోని గోషామ‌హ‌ల్.. ఎల్బీన‌గ‌ర్.. ముషీరాబాద్ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్.. బీజేపీ కార్పొరేటర్ల మధ్య వివాదాలు నెలకొంటున్నాయి. అధికారులు తమ మాటే వినాలంటూ కార్పొరేటర్లు.. ఎమ్మెల్యేలు ఒత్తిడి తెస్తుండటంతో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.

    తాజాగా గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ కొత్తగా గెలిచిన కార్పొరేట‌ర్లు.. అధికారుల‌తో ఇటీవల స‌మావేశం ఏర్పాటు చేశారు. గెలిచిన కార్పొరేట‌ర్లు బాధ్యతలు స్వీక‌రించ‌కపోయినా త‌మ పార్టీ కార్పొరేట‌ర్లు చెప్పిన విధంగా న‌డుచుకోవాల‌ని అధికారుల‌ను ఆదేశించినట్లు సమాచారం.

    గోషామహల్లో ఆరు డివిజన్లు ఉండగా ఐదు డివిజన్లలో బీజేపీనే గెలుపొంది సత్తా చాటింది. దీంతో టీఆర్ఎస్ పాత కార్పొరేటర్లకు.. బీజేపీ కొత్త కార్పొరేటర్లకు మధ్య ప్రచ్ఛన్నయుద్ధం నడుస్తోంది.

    Also Read: అమ్మాయి ప్రాణం తీసిన ఆన్ లైన్ అప్పు

    ఎల్బీ న‌గ‌ర్.. ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇదే సీన్ రిపీట్ అవుతోంది. ఎల్బీన‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గంలో మొత్తం11 డివిజ‌న్లు ఉండ‌గా ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో అన్ని డివిజ‌న్లను కషాయ జెండా రెపరెపలాడింది. అయితే ఇక్కడ ఎమ్మెల్యే టీఆర్ఎస్‌కు చెందిన సుధీర్ రెడ్డి ఉన్నారు.

    దీంతో 11మంది పాత టీఆర్ఎస్ కార్పొరేట‌ర్లు.. 11మంది కొత్తగా గెలిచిన బీజేపీకి చెందిన కార్పొరేట‌ర్ల మ‌ధ్య విభేదాలు అప్పుడే మొద‌ల‌య్యాయి. ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలోనూ ఆరు డివిజ‌న్లకు బీజేపీ ఐదు.. ఒక డివిజ‌న్ ను ఎంఐఎం నిల‌బెట్టుకుంది.

    ముషీరాబాద్లో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఉన్నారు. దీంతో పాత టీఆర్ఎస్ కార్పొరేట‌ర్లకు.. కొత్తగా ఎన్నికైన బీజేపీ కార్పొరేట‌ర్లకు అధికారం కోసం ఆదిప‌త్య పోరు నడుస్తోంది.

    మరో రెండు నెలలపాటు జీహెచ్ఎంసీ పరిధిలో ఇదే వాతావరణం ఉండనుండటంతో అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ రెండు నెలలు అధికారులకు పాలన అనేది కత్తిమీద సాములా మారిందనే టాక్ విన్పిస్తోంది.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్