కరోనాకు ముందు.. కరోనాకు తర్వాత..: లోకేష్‌ రాజకీయ పరిణితి ఇదీ

చంద్రబాబు తనయుడు నారా లోకేష్‌ ప్రస్తుతం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో కొనసాగుతున్నారు. ఆయన ఎప్పుడు ఏం మాట్లాడినా చర్చే.. రచ్చే. పార్టీలోనూ ఆయన వ్యవహారం సీనియర్‌‌ లీడర్లలోనూ అసంతృప్తి కలిగిస్తుంటుంది. ఇప్పుడు మరోసారి పార్టీ క్యాడర్‌‌ల ఆయన మీద చర్చ మొదలైంది. క‌రోనాకు ముందు.. త‌ర్వాత‌.. రాజ‌కీయ నాయ‌కుడిగా ఆయ‌న ప‌రిణితి సాధించిన విష‌యంపై చ‌ర్చించుకుంటున్నారు. Also Read: ఉరితాళ్లు పట్టుకెళ్లి బాబును ఒప్పిస్తం.. టీడీపీ నేతలు క‌రోనా స‌మ‌యంలో ట్విట్టర్ ద్వారా నిరంత‌రం […]

Written By: Srinivas, Updated On : December 17, 2020 1:22 pm
Follow us on


చంద్రబాబు తనయుడు నారా లోకేష్‌ ప్రస్తుతం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో కొనసాగుతున్నారు. ఆయన ఎప్పుడు ఏం మాట్లాడినా చర్చే.. రచ్చే. పార్టీలోనూ ఆయన వ్యవహారం సీనియర్‌‌ లీడర్లలోనూ అసంతృప్తి కలిగిస్తుంటుంది. ఇప్పుడు మరోసారి పార్టీ క్యాడర్‌‌ల ఆయన మీద చర్చ మొదలైంది. క‌రోనాకు ముందు.. త‌ర్వాత‌.. రాజ‌కీయ నాయ‌కుడిగా ఆయ‌న ప‌రిణితి సాధించిన విష‌యంపై చ‌ర్చించుకుంటున్నారు.

Also Read: ఉరితాళ్లు పట్టుకెళ్లి బాబును ఒప్పిస్తం.. టీడీపీ నేతలు

క‌రోనా స‌మ‌యంలో ట్విట్టర్ ద్వారా నిరంత‌రం పార్టీని న‌డిపించేందుకు చేసిన ప్రయ‌త్నాల‌ను ఇప్పుడు నేతలు కొనియాడుతున్నారు. అదే స‌మ‌యంలో క‌రోనా ఉన్నప్పటికీ.. కొన్ని సంద‌ర్భాల్లో దూకుడుగా వ్యవ‌హ‌రించిన తీరునూ ప్రశంసిస్తున్నారు. ఎక్కువుగా సోష‌ల్ మీడియాను వాడి.. ప్రభుత్వంపై విమ‌ర్శలు చేయ‌డంతోపాటు.. ప్రజ‌ల‌కు అవ‌స‌ర‌మైన సూచ‌న‌లు, స‌ల‌హాలు ఇవ్వడంలోనూ లోకేష్ చురుకైన పాత్ర పోషించార‌ని అంటున్నారు. ఇక‌.. మండ‌లిలోనూ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా ప్రజావ్యతిరేక బిల్లుల‌‌ను నిలువ‌రించేలా వ్యూహాత్మకంగా వ్యవ‌హ‌రించిన తీరును కూడా ప్రశంసిస్తున్నారు.

ఒక‌ప్పుడు య‌న‌మ‌ల వంటివారు మాత్రమే మండ‌లిలో ప్రత్యేక ఆక‌ర్షణ‌గా నిలిస్తే.. ఇప్పుడు నారా లోకేష్ కూడా ప‌ట్టుసాధించార‌ని, స‌భా వ్యవ‌హారాలపైనా ఆయ‌న ప‌ట్టు పెంచుకుంటున్నార‌ని పార్టీ నేత‌లు చ‌ర్చించుకుంటున్నారు. స‌భ‌లో ఎలా వ్యవ‌హ‌రించాలో కూడా లోకేష్ ప‌రిణితి సాధించార‌ని చెబుతున్నారు. నారా లోకేష్‌ ఇన్ని ఏళ్లుగా రాజకీయాల్లో ఉంటున్నా.. సొంత పార్టీ నేతల నుంచి ఇప్పటివరకు పెద్దగా ప్రశంసలు అందుకోలేదు. కానీ.. ఈ మధ్య మాత్రం ఈ ప్రశంసలు పెరిగిపోయాయి.

Also Read: తిరుపతి బరిలో జనసేన..బీజేపీకి షాక్?

కరోనా టైంలోనే కాకుండా.. ఉభ‌య‌గోదావ‌రి జిల్లాల్లో పంట‌లు మునిగిన‌ప్పుడు గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో లోకేష్‌ పర్యటించారు. దీంతోపాటు ఏలూరు సంఘ‌ట‌న వెంట‌నే స్పందించి అక్కడ‌కు చేరుకుని బాధితుల‌ను ప‌రామ‌ర్శించారు. దీంతో లోకేష్ వార్తల్లోనూ, ప్రజ‌ల్లోనూ బాగా నానాడు. అయితే.. అదే స‌మయంలో ప్రజ‌ల‌ను మ‌రింత‌గా ఆక‌ర్షించేందుకు త‌న వాక్చాతుర్యాన్ని మెరుగు ప‌రుచుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని సీనియ‌ర్లు సూచిస్తున్నారు. ఏదో బ‌ట్టీ ప‌ట్టిన‌ట్టు మాట్లాడ‌డం కాకుండా మ‌రింత మెరుగ్గా పంచ్ డైలాగుల‌తో ఆక‌ట్టుకునేలా కూడా నారా లోకేష్ మాట తీరును మెరుగు ప‌రుచుకోవాల‌ని చెబుతున్నారు.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్