టీపీసీసీ చీఫ్‌ రేసులో ఉన్నది వీరే

వరుస ఓటములతో కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి రాష్ట్రంలో పూర్తిగా దిగజారింది. ఇటీవల జరిగిన దుబ్బాక ఎన్నికల్లోనూ పెద్దగా సత్తా చాటలేకపోయింది. దీంతో ఆ పార్టీ పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌‌ రెడ్డి తన పదవికి రాజీనామా చేస్తూ అధిష్టానానికి లేఖ రాశారు. ఆ సమయంలో అధిష్టానం ఆ లేఖను ఆమోదించలేదు. ఆ తర్వాత వచ్చిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ పార్టీ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. దీంతో ఆ రాజీనామా లేఖను ఆమోదించాలని మరోసారి అధిష్టానంతో మొరపెట్టుకున్నారు ఉత్తమ్‌. Also […]

Written By: Srinivas, Updated On : December 17, 2020 1:28 pm
Follow us on


వరుస ఓటములతో కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి రాష్ట్రంలో పూర్తిగా దిగజారింది. ఇటీవల జరిగిన దుబ్బాక ఎన్నికల్లోనూ పెద్దగా సత్తా చాటలేకపోయింది. దీంతో ఆ పార్టీ పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌‌ రెడ్డి తన పదవికి రాజీనామా చేస్తూ అధిష్టానానికి లేఖ రాశారు. ఆ సమయంలో అధిష్టానం ఆ లేఖను ఆమోదించలేదు. ఆ తర్వాత వచ్చిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ పార్టీ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. దీంతో ఆ రాజీనామా లేఖను ఆమోదించాలని మరోసారి అధిష్టానంతో మొరపెట్టుకున్నారు ఉత్తమ్‌.

Also Read: ఉరితాళ్లు పట్టుకెళ్లి బాబును ఒప్పిస్తం.. టీడీపీ నేతలు

ఇప్పుడు తెలంగాణ పీసీసీలో పీసీసీ చీఫ్‌ రేస్‌ నడుస్తోంది. అధ్యక్షుడిగా ఎవరిని నియమిస్తారనేది హాట్‌ టాపిక్‌లా మారింది. ఆ పదవి కోసం అటు సీనియర్లు.. ఇటు యంగ్‌ స్టర్స్‌ కూడా పోటీ పడుతున్నారు. ముఖ్యంగా ఎంపీలు రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పోటీ పడుతున్నండగా.. మరికొందరు నేతలు కూడా తమ వంతు ప్రయత్నాలు సాగిస్తున్నారు. వారిలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన నేతలు కూడా ఉన్నారు.

ఇటీవల రాష్ట్రానికి వచ్చిన రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్ నాలుగు రోజులపాటు ఇక్కడే మకాం వేశారు. టీపీసీసీ అధ్యక్షుడిగా ఎవరిని నియమిస్తే బాగుంటుందన్న విషయంపై నాయకుల నుంచి అభిప్రాయాలు సేకరించి నివేదికను అధిష్టానానికి అందజేశారు. ఒకటి రెండు రోజుల్లో సోనియాగాంధీ, రాహుల్ గాంధీ ఈ విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోనున్నారని సమాచారం. దీంతో కాంగ్రెస్ అధ్యక్ష పదవిని ఆశిస్తున్న నేతల తోపాటు సీనియర్ నేతలందరూ ఢిల్లీకి చేరుకొని అక్కడ పార్టీకి చెందిన అగ్ర నేతలతో మంతనాలు సాగిస్తూ తమకు లేదా తాము కోరుకున్న వారికి అధ్యక్ష పీఠం దక్కేలా ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

ముఖ్యంగా పీసీసీ అధ్యక్ష రేసులో ఎంపీలు రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితోపాటు మాజీ మంత్రి శ్రీధర్‌బాబు పేర్లు తెరపైకి వచ్చాయి. అధిష్టానం మాత్రం రేవంత్ రెడ్డి వైపే మొగు చూపుతున్నట్లు తెలుస్తోంది. అయితే మిగతా సీనియర్ నేతలందరూ ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి కాకుండా మొదటి నుంచి పార్టీలో ఉన్న తమలో ఎవరికో ఒకరికి పదవిని కట్టబెట్టాలని అధిష్టానానికి లేఖ రాశారు. మరో వర్గం ఇప్పటికే రెడ్డి సామాజికవర్గానికి చెందిన నేత పదవిలో ఉండి రాజీనామా చేసినందున బీసీకి అవకాశం కల్పించాలని కోరుతున్నారు. అంటే.. రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, శ్రీధర్ బాబు, జిల్లాకు చెందిన మాజీ ఎంపీ, ప్రస్తుత కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్‌తోపాటు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేర్లు తెరపైకి వచ్చాయి. జగ్గారెడ్డి కూడా అధ్యక్ష పదవి రేసులో ఉన్నారు. బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన శ్రీధర్ బాబు అందరికీ ఆమోదయోగ్యమైన వ్యక్తిగా ఆవకాశం కల్పించాలని కొందరు కోరుతుండగా, జీవన్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ పోటీలో ఉన్నట్లు ప్రకటించకుండా తమ ప్రయత్నాలు తాము చేస్తున్నట్లు చెబుతున్నారు.

Also Read: తిరుపతి బరిలో జనసేన..బీజేపీకి షాక్?

అయితే.. ఏఐసీసీ వద్ద ఉన్న పేర్లలో ఆరుగురు క్యాండిడేట్లు ఉమ్మడి కరీంనగర్‌‌ జిల్లాకు చెందిన వారే. ఇప్పటికే అధికార టీఆర్ఎస్ పార్టీలో ఉమ్మడి జిల్లా పరిధిలోని సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా జగిత్యాలకు చెందిన ఎల్.రమణ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా జిల్లాకు చెందిన చాడ వెంకట్ రెడ్డి, ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా జిల్లాకే చెందిన బండ సురేందర్‌రెడ్డి నాయకత్వం వహిస్తున్నారు. అధికార, ప్రతిపక్ష పార్టీల్లో ప్రధానమైన ఐదు పార్టీలకు జిల్లాకు చెందిన నేతలే నాయకత్వం వహించడంతోపాటు కాంగ్రెస్ పార్టీలో కూడా పొన్నం ప్రభాకర్ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్నారు. అన్ని పార్టీల్లోనూ కరీంనగర్ జిల్లా నాయకులు కీలక స్థానాల్లో ఉండటంతో.. ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు అధ్యక్ష పీఠం కోసం పోటీ పడడం ఆసక్తికరంగా మారింది.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్