https://oktelugu.com/

యూరప్ దేశాలను హడలెత్తిస్తున్న కొత్త కరోనా.. ఫ్రాన్స్ లో తొలి కేసు నమోదు..!

కొత్త కరోనా స్ట్రెయిన్ ప్రపంచ దేశాలను బెంబేలెత్తిస్తోంది. బ్రిటన్.. దక్షిణాఫ్రికాల్లో కొత్త వైరస్ విజృంభిస్తుండటంతో అన్ని దేశాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే పలుదేశాలు లాక్డౌన్ దిశగా వెళుతున్నాయి. Also Read: సంచలనం.. కరోనాను జయించిన ‘ధారవి’..! ఇప్పటికే లండన్ తోపాటు యూరప్ దేశాలు క్రిస్మస్.. న్యూ ఇయర్ వేడుకలను రద్దు చేసుకున్నాయి. అయితే తాజాగా ఫ్రాన్స్ లో కొత్త కరోనా కేసు నమోదుకావడం ఆందోళన రేకెత్తిస్తోంది. బ్రిటన్లో నివాసం ఉంటున్న ఓ ఫ్రాన్స్ పౌరుడు ఇటీవల ఆదేశానికి వచ్చాడు. […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 26, 2020 / 12:20 PM IST
    Follow us on

    కొత్త కరోనా స్ట్రెయిన్ ప్రపంచ దేశాలను బెంబేలెత్తిస్తోంది. బ్రిటన్.. దక్షిణాఫ్రికాల్లో కొత్త వైరస్ విజృంభిస్తుండటంతో అన్ని దేశాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే పలుదేశాలు లాక్డౌన్ దిశగా వెళుతున్నాయి.

    Also Read: సంచలనం.. కరోనాను జయించిన ‘ధారవి’..!

    ఇప్పటికే లండన్ తోపాటు యూరప్ దేశాలు క్రిస్మస్.. న్యూ ఇయర్ వేడుకలను రద్దు చేసుకున్నాయి. అయితే తాజాగా ఫ్రాన్స్ లో కొత్త కరోనా కేసు నమోదుకావడం ఆందోళన రేకెత్తిస్తోంది.

    బ్రిటన్లో నివాసం ఉంటున్న ఓ ఫ్రాన్స్ పౌరుడు ఇటీవల ఆదేశానికి వచ్చాడు. అతడికి ఎటువంటి లక్షణాలు లేకపోపోవడంతో ఇంటి వద్దనే స్వీయ నిర్బంధంలో ఉన్నాడు.

    ఈక్రమంలోనే అతడు అస్వస్థకు గురికాగా డిసెంబరు 21న ఆస్పత్రికి తరలించి పరీక్షలు చేయించగా కొత్త కరోనా స్ట్రెయిన్ సోకినట్టు తేలింది. దీంతో అతడితో కాంటాక్ట్ అయిన వారిని గుర్తించే పనిలో అధికారులు పడ్డారు.

    Also Read: హైఅలెర్ట్: బ్రిటన్ నుంచి తెలంగాణకు వచ్చిన 16మందికి కరోనా

    దేశంలోకి కొత్తరకం కరోనా ఇప్పటికే ప్రవేశించి ఉంటుందని నాలుగు రోజుల కిందట ఫ్రాన్స్ ఆరోగ్య మంత్రి ఓలీవియర్ వెర్నర్ వ్యాఖ్యానించారు. దీంతోపాటు రోమ్‌లో కొత్తరకం కరోనా కేసును గుర్తించినట్టు ఇటలీ అధికార వర్గాలు వెల్లడిచారు.

    డెన్మార్క్‌లో 9.. నెదర్లాండ్.. ఆస్ట్రేలియాలో ఒక్కొకకటి చొప్పున కొత్త కరోనా కేసులు నమోదయినట్టు డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. ఫ్రాన్స్ లో కొత్త కరోనా కేసులు నమోదు కావడంతో బ్రిటన్ ప్రయాణాలపై జనవరి 5వరకు నిషేధం విధించింది.

    మరిన్ని వార్తల కోసం అంతర్జాతీయ వార్తలు