ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి వంటి విమర్శకుల ప్రశంసలు పొందిన వాణిజ్యపరంగా విజయవంతమైన చిత్రాలను నిర్మించిన దర్శకుడు నాగ్ అశ్విన్ తాజాగా ‘జాతిరత్నాలు’ మూవీతో మనముందుకు వస్తున్నాడు. ఆయన నిర్మాతగా మారి ఈ సినిమా తీశాడు. ఇక పాన్ ఇండియా లెవల్లో ప్రభాస్ తో మరో చిత్రం చేయడానికి సన్నద్ధమవుతున్నాడు. ఈ చిత్రం మహా శివరాత్రి సందర్భంగా ఈనెల 11న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది.
నాగ్ అశ్విన్ తనకు కామెడీ సినిమాలు చూడటం చాలా ఇష్టమని.. జంధ్యాల, ఎస్.వి.కృష్ణారెడ్డి తన అభిమాన దర్శకులు అని చెప్పారు. “అనుదీప్ అనే కొత్త దర్శకుడు చేసిన షార్ట్ ఫిల్మ్ నాకు బాగా నచ్చింది. కాబట్టి, పూర్తిగా ఉల్లాసంగా ఉండే ఎంటర్టైనర్ చేయడానికి నేను అతనిని సంప్రదించాను. అనుదీప్ నాకు కథ చెప్పాడు.. మేము దానిని సినిమా చేయడానికి అభివృద్ధి చేసాం. ”అని నాగ్ అశ్విన్ తెలిపాడు.
“అనుదీప్ నాకు టైటిల్స్ పై మూడు ఆప్షన్లు ఇచ్చాడని.. వాటిలో జతిరత్నాలు నచ్చి.. మంచి వ్యాపారం చేయడానికి ఈ టైటిల్ బాగుందని ఫిక్స్ చేశామన్నారు. దానిని ఖరారు చేసామన్నారు.
జాతిరత్నాలు అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ అవుతుందని నాగ్ అశ్విన్ వివరించారు. కథ గురించి వివరించారు. “ముగ్గురు వెర్రి వ్యక్తులు తీవ్రమైన నేరంలో చిక్కుకుంటారు. వారు దాని నుండి ఎలా బయటకు వస్తారు అనేది కథ. చిక్కులను విప్పే కథాంశం ”
నాగ్ అశ్విన్ మరో సీక్రెట్ ను రివీల్ చేశాడు. తన మొదటి చిత్రం ‘ఎవడే సుబ్రహ్మణ్యం’లో మొదట హీరోలుగా నవీన్ పొలిషెట్టి – విజయ్ దేవరకొండలను అనుకున్నానని.. కాని కొన్ని కారణాల వల్ల అది కార్యరూపం దాల్చలేదని వివరించాడు. “నవీన్ ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ చేస్తున్నప్పుడు, మేము అతడిని జతి రత్నలు కోసం సంప్రదించామన్నారు. అతను వెంటనే ప్రధాన పాత్రలలో ఒకటైన ఈ సినిమా చేయడానికి అంగీకరించాడు. ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణలను తరువాత ఖరారు చేశాం. ” అని వివరించాడు.
జాతి రత్నాలు చిత్రం మంచి సందేశాన్ని ఇస్తుందని నాగ్ అశ్విన్ తెలిపాడు. నవీన్ కు హిందీలో మంచి మార్కెట్ ఉన్నందున, ఈ చిత్రాన్ని హిందీలోకి డబ్బింగ్ చేసి విడుదల చేసే ప్రణాళికలు తమ వద్ద ఉన్నాయని నాగ్ అశ్విన్ చెప్పారు. “ఈ చిత్రాన్ని ఇక్కడ విడుదల చేసిన తరువాత, డబ్ చేసి హిందీలో విడుదల చేయాలని మేము యోచిస్తున్నాము” అని తెలిపారు.
హీరో ప్రభాస్ గురించి నాగ్ అశ్విన్ పంచుకున్నాడు. “ప్రభాస్ చాలా సంతోషంగా ఉండే వ్యక్తి. అతను వ్యాపార సమీకరణాలు.. బాక్సాఫీస్ ఓపెనింగ్స్ గురించి పెద్దగా ఆలోచించడు. అతడికి సోషల్ మీడియాపై పెద్దగా ఆసక్తి లేదు. మేము కలిసినప్పుడల్లా.. అతను మా చిత్రాల గురించి.. అతను చేస్తున్న ఇతర చిత్రాల కథల గురించి మాట్లాడుతాడు. ” అని ప్రభాస్ సింప్లిసిటీని వివరించాడు.