https://oktelugu.com/

జబర్దస్త్ కమెడియన్ కు జలక్ ఇచ్చిన నాగబాబు.. బిగ్ బాస్ విన్నర్ అతడేనట?

మెగా బ్రదర్ నాగబాబు సినిమాల్లో కంటే బుల్లితెరపైనే ఎక్కువగా సందడి చేస్తున్నారు. జబర్దస్త్ షో ఓ రేంజులో పాపులర్ కావడానికి జడ్జి నాగబాబు.. రోజాలే కారణం. అయితే ఉన్నట్టుండి నాగబాబు ఆ షో నుంచి తప్పుకోవడం అప్పట్లో సంచనలంగా మారింది. ఈ షో నుంచి తప్పుకున్న నాగబాబు సొంతకుంపటి పెట్టుకున్న సంగతి అందరికీ తెల్సిందే..! Also Read: బిజినెస్‌ మొదలెట్టిన ఆనంద్ దేవరకొండ జీ తెలుగులో ‘అదిరింది’ కామెడీ షోను జబర్దస్త్ కు పోటీగా తీసుకొచ్చారు. అయితే […]

Written By:
  • NARESH
  • , Updated On : November 26, 2020 / 02:10 PM IST
    Follow us on

    మెగా బ్రదర్ నాగబాబు సినిమాల్లో కంటే బుల్లితెరపైనే ఎక్కువగా సందడి చేస్తున్నారు. జబర్దస్త్ షో ఓ రేంజులో పాపులర్ కావడానికి జడ్జి నాగబాబు.. రోజాలే కారణం. అయితే ఉన్నట్టుండి నాగబాబు ఆ షో నుంచి తప్పుకోవడం అప్పట్లో సంచనలంగా మారింది. ఈ షో నుంచి తప్పుకున్న నాగబాబు సొంతకుంపటి పెట్టుకున్న సంగతి అందరికీ తెల్సిందే..!

    Also Read: బిజినెస్‌ మొదలెట్టిన ఆనంద్ దేవరకొండ

    జీ తెలుగులో ‘అదిరింది’ కామెడీ షోను జబర్దస్త్ కు పోటీగా తీసుకొచ్చారు. అయితే ఈ షోకు జబర్దస్త్ ను బీట్ చేయలేకపోయింది. సంవత్సరంపాటు అదిరింది కామెడీ షోను నిర్వహించారు. కాగా కొన్ని మార్పులు చేసి ‘బొమ్మ అదిరింది’గా మళ్లీ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ‘అదిరింది’ షో కంటే ‘బొమ్మ అదిరింది’ కార్యక్రమం పాపులర్ అయి జబర్దస్త్ కు పోటీ ఇస్తుంది.

    ‘బొమ్మ అదిరింది’ షో త్వరలోనే జబర్దస్త్ ను బీట్ చేసేలా కన్పిస్తుంది. కాంట్రవర్సీలతో మొదలైన ‘బొమ్మ అదిరింది’ షో ప్రస్తుతం ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తోంది. ఈ షోతోపాటు నాగబాబు తన యూట్యూబ్ ఛానల్ ‘నా ఇష్టం’లో మాట్లాడుతూ అభిమానులను అలరిస్తుంటాడు. తాజాగా నాగబాబు తెలుగులో నెంబర్ వన్ రియల్టీ షోగా కొనసాగుతున్న బిగ్ బాస్ పై స్పందించారు.

    బాగ్ బాస్-4 సీజన్ ప్రస్తుతం ముగింపు దశకు చేరుకుంది. డిసెంబర్ 20న గ్రాండ్ ఫినాలే నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈక్రమంలోనే పలువురు సెలబెట్రీలు బిగ్ బాస్-4 విజేతపై వీరేనంటూ స్పందిస్తున్నారు. అయితే నాగబాబు మాత్రం బిగ్ బాస్ లో కొనసాగుతున్న జబర్దస్త్ కామెడియన్ ముక్కు అనినాష్ కు ఝలక్ ఇచ్చారు. టైటిల్ విన్నర్ గా అనివాష్ పేరు కాకుండా మరొకరిని పేరును వెల్లడించి అందరికీ షాకిచ్చాడు.

    Also Read: పదో తరగతిలోనే లెటర్ రాసిన నిహారిక.. నాగబాబు సంచలన కామెంట్స్..!

    జబర్దస్త్ ఆర్టిస్టులతో నాగబాబుకు మంచి సంబంధాలు ఉన్నారు. నాగబాబు జబర్దస్త్ నుంచి బయటికి వచ్చిన క్రమంలో కొందరు ఆయనకు మద్దతుగా నడిచారు. ముక్కు అవినాష్ జబర్దస్త్ నుంచి తప్పుకొని బిగ్ బాస్-4లోకి వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చాడు. నాటి నుంచి నేటి వరకు బిగ్ బాస్ ప్రేక్షకులకు ఎంటట్మైనెంట్ పంచుతున్నాడు. బిగ్ బాస్ టైటిల్ విన్నర్ నాగబాబు స్పందిస్తూ ప్రస్తుతం ఉన్న కంటెస్టుల్లో అందరూ బాగా ఆడుతున్నారని చెప్పారు.

    అయితే నాగబాబుకు మాత్రం అభిజిత్ గేమ్ నచ్చినట్లు చెప్పారు. ఈసారి టైటిల్ విన్నర్ అయ్యేది అతడేనంటూ స్పష్టం చేశాదు. అభిజిత్ తాను అందరి ముందే మాట్లాడుతాడని.. ఎప్పుడు చూసినా కూల్ గానే ఉంటాడని చెప్పాడు. అతడి కెరీర్ ముందు నుంచి బాగుంటుందని అనుకున్నానని అయితే ఎందుకో కుదరలేదన్నాడు. ఇక బిగ్ బాస్ తర్వాత అతడి కెరీర్ బాగుండాలని కోరుకుంటున్నట్లు నాగబాబు కామెంట్స్ చేశారు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

    నాగబాబు కామెంట్స్ ఇలా ఉంటే జబర్దస్త్ కామెడియన్లు మాత్రం అవినాష్ కు మద్దతుగా ఓట్లు వేయాలని వీడియోలు పెడుతున్నారు. దీంతో అవినాష్ బిగ్ బాస్ షో ఫైనల్ వరకు ఉండే అవకాశం కన్పిస్తుంది. ఏదిఏమైనా నాగబాబు జబర్దస్త్ కామెడియన్ కు కాకుండా మరో కంటెస్టెంట్ కు మద్దతు ప్రకటించడం ఆసక్తిని రేపుతోంది. అభిజిత్ టైటిల్ విన్నర్ అవుతాడని నాగబాబు చెప్పడంతో అభి ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.